కుంభమేళా చరిత్ర : మహావిష్ణు అమృతం ధారపోసిన స్థలాలివే

హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ...గంగానదికీ సంబంధం ఏమిటి...

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 04:53 AM IST
కుంభమేళా చరిత్ర : మహావిష్ణు అమృతం ధారపోసిన స్థలాలివే

హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ…గంగానదికీ సంబంధం ఏమిటి…

ఉత్తరప్రదేశ్ : హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ…గంగానదికీ సంబంధం ఏమిటి…ప్రత్యేకంగా ఆ నాలుగు ప్రదేశాలలోనే ఎందుకు చేస్తారు..కారణం ఏమిటి..ఎప్పటి నుండి ప్రారంభం  అయ్యింది..ఇలా ఎన్నో ప్రశ్నలు..కోట్ల ఖర్చుతో కుంభమేళా చేయాల్సిన అవసరమేంటి తెలుసుకుందాం..

మార్చి 15 నుండి ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా 
2019లో కుంభ మేళా జనవరి 15 నుంచీ మార్చి 4 వరకూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ (అలహాబాద్)లో జరగనుంది.  ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి జరిగే ఈ మహా వేడుకకు  12 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాధారణంగా పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది. అర్థ కుంభ మేళా ఆరేళ్లకు ఓసారి జరుగుతుంది. ఐతే… పురాణాల్లో అర్థ కుంభ మేళా ప్రసక్తి లేదని కొందరు చెబుతుంటారు. 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభ మేళా జరపాలని శతాబ్దాల కిందటే సాధు-సంత్‌ల మండలి నిర్ణయించింది. 

ఆ నాలుగు ప్రదేశాలలో మాత్రమే ఎందుకు చేస్తారు
ఈ అర్ధ కుంభ మేళా ప్రయాగ, హరిద్వార్‌లలో మాత్రమే జరుగనుంది. 2013లో కుంభ మేళా జరగడంతో 2019లో అర్ధ కుంభ మేళా జరుగనుంది.  పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు… భారతదేశంలోని నాలుగు ప్రదేశాల్లో అమృతాన్ని ధారపోశారు. అవే హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఈ నాలుగు ప్రదేశాల్లో గ్రహాలను అనుసరించి కుంభమేళా జరుగుతోంది. పురాణాల్లో చెప్పినట్లు ప్రయాగరాజ్‌లో త్రివేణీ సంగమ ప్రాంతంలో సరస్వతి నది అంతర్గతంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. మూడు దశాబ్దాలుగా నాసాతో కలిసి భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో నది ఉన్నట్లు స్పష్టమైంది. అంతర్గతంగా ప్రవహిస్తున్న సరస్వతి నది మార్గంలోనే యమునా నది ప్రవహిస్తోందని నమ్మకం. 

క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో గ్రీకుల నాగరికత నుంచీ కుంభ మేళా 
క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో గ్రీకుల నాగరికత నుంచీ కుంభను స్వీకరించారు. అప్పట్లో గంగా నదిని పూజిస్తూ ఉండటంతో… కుంభ మేళాకీ, గంగానదికీ విడదీయరాని సంబంధం ఏర్పడింది. గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తే, సర్వ పాపాలూ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. వెయ్యి కార్తీక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వంద మాఘ మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వైశాఖ మాస స్నానాలు కోటి సార్లు నర్మదా నదిలో చేసిన ఫలితాన్ని… ఒక్కసారి కుంభ మేళా స్నానంతో మనం పొందుతామని స్కందపురాణం చెబుతోంది.

ఎంత కాలుష్యం జరుగుతున్నా పవిత్ర గంగాగా ప్రసిద్ధి
చిత్రమేంటంటే… ఈ రోజుల్లో గంగానదిని మనం ఎంతలా కాలుష్యం చేస్తున్నా… ఆ నది ఇప్పటికీ పవిత్రంగానే ఉంటోంది. గంగా నది వల్ల ఎవరికీ ఎలాంటి వ్యాధులూ రావట్లేదని సైంటిఫిక్‌గా తేలింది. కారణం ఈ నదీ ప్రవాహం హిమాలయాల నుంచీ మొదలవుతుండటంతో… ఎప్పటికప్పుడు కొత్త జలంతో గంగానది తనను తాను ప్రక్షాళన చేసుకుంటోందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ గంగానదీ తీరంలో విష్ణుమూర్తి అమృతాన్ని ధార పోసిన ఈ ప్రాంతాలలో కుంభమేళాను చేయటం ఆనవాయితీగా వస్తోంది.