Private Hospital Vaccines: ప్రైవేట్ హాస్పిటల్స్‌కు మాత్రం వ్యాక్సిన్ ఎలా అందుతుంది – ఢిల్లీ గవర్నమెంట్

ఢిల్లీలో 18 నుంచి 44ఏళ్ల లోపు వయస్సున్న వారికి జూన్ 10 వరకూ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఈ మేరకే వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.

Private Hospital Vaccines: ప్రైవేట్ హాస్పిటల్స్‌కు మాత్రం వ్యాక్సిన్ ఎలా అందుతుంది – ఢిల్లీ గవర్నమెంట్

Private Hospitals Vaccine

Private Hospital Vaccines: ఢిల్లీలో 18 నుంచి 44ఏళ్ల లోపు వయస్సున్న వారికి జూన్ 10 వరకూ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఈ మేరకే వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో.. ప్రైవేట్ హాస్పిటల్స్ కు మాత్రం వ్యాక్సిన్ ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. అదే సమయంలో కేంద్రం రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో సరిపడ స్టాక్ లేదని చెప్పడం వెనుక కారణమేంటని ప్రశ్నిస్తున్నారు.

‘జూన్ వరకూ 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్కులకు వ్యాక్సిన్ దొరకదని కేంద్ర మాకు చెప్పింది. అందుకే జూన్ 10కి లోపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రద్దు చేశాం’ అని సిసోడియా టెలివిజన్ స్టేట్మెంట్ లో తెలిపారు.

ఢిల్లీలో ఉన్న 18 నుంచి 44ఏళ్ల గ్రూప్ వారికి 5.5లక్షల కొవిడ్-19 వ్యాక్సిన్ కావాల్సి ఉంది. దాదాపు 92లక్షల మందికి వ్యాక్సిన్ కావాలి. ఈ కేటగిరలో 1.84కోట్ల డోసులు అవసరం ఉండగా కేంద్రం ఏప్రిల్ లో 4.5లక్షల డోసులు, మే నెలలో 3.67లక్షల డోసులు మాత్రమే ఇచ్చింది. మ్యాన్యుఫ్యాక్చర్ల నుంచి 8.17లక్షల డోసులు అందాయి.

ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అర్జెంటుగా 10మిలియన్ డోసుల కొవిడ్ వ్యాక్సిన్ అడుగుతుంది. జూనె 7నాటికి వ్యాక్సిన్ ను ఎవరు సప్లై చేయగలరో అని కొనుగోలు ప్రక్రియకు కూడా రెడీగా ఉంది.

దేశ రాజధానిలో గడిచిన 24గంటల్లో 956 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రెండు నెలలో తక్కువ నమోదైన కేసులివే. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కొత్త ఇన్ఫెక్షన్ల నమోదు క్రమంగా తగ్గుతూ ఉంటే.. మిగిలిన కార్యకలాపాలను తిరిగి ఓపెన్ చేసే అవకాశం ఉందని అన్నారు.