Personal Loan On Aadhaar : మీ ఆధార్‌పై పర్సనల్ లోన్ ఇక ఈజీ.. అప్లయ్ చేసుకోండిలా!

ప్రతిఒక్కరికి ఏదో ఒక సమయంలో డబ్బు అవసరం పడుతుంది. అలాంటప్పుడు పెద్దమొత్తంలో రుణం వెంటనే దొరకాలంటే కష్టమే మరి. బ్యాంకులు కూడా అప్పటికప్పుడూ రుణాలు అందకపోవచ్చు.

Personal Loan On Aadhaar : మీ ఆధార్‌పై పర్సనల్ లోన్ ఇక ఈజీ.. అప్లయ్ చేసుకోండిలా!

How To Apply For A Personal Loan On Aadhaar

Personal Loan On Aadhaar  : ప్రతిఒక్కరికి ఏదో ఒక సమయంలో డబ్బు అవసరం పడుతుంది. అలాంటప్పుడు పెద్దమొత్తంలో రుణం వెంటనే దొరకాలంటే కష్టమే మరి. బ్యాంకులు కూడా అప్పటికప్పుడూ రుణాలు అందకపోవచ్చు. రుణాలిచ్చేందుకు వందలాది బ్యాంకులు, ఇతర ఫైనాన్సింగ్ సంస్థలు ఇన్ స్టంట్ లోన్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. అనేక రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. మీరు స్వల్పకాలిక రుణాల కోసం చూస్తున్నారా? మీ జీతంపై లభించే వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు.

అదే గృహాలు, కార్ల వంటి ఆస్తిని కొనుగోలు చేస్తే.. తనఖా రుణాలను ఎంచుకోవచ్చు. రుణగ్రహీతలకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. వ్యక్తిగత రుణాలు సర్వసాధారణం. వ్యక్తిగత రుణాలను పొందేవారు ప్రధానంగా నెలవారీ బడ్జెట్, ట్యూషన్ ఫీజులు, అత్యవసర ప్రయోజనాల కోసం డబ్బును వినియోగిస్తుంటారు. రుణాలు పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో వ్యక్తిగత రుణాల కోసం అప్లయ్ చేసుకునేవారు ఆధార్ ద్వారా పర్సనల్ లోన్స్ పొందవచ్చు. ఆధార్ ఉపయోగించి వ్యక్తిగత రుణం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Job Reject : ఉద్యోగం కోసం అప్లై చేస్తే.. 8 ఏళ్ల తర్వాత సందేశం పంపారు.

ఆధార్ పర్సనల్ లోన్ అంటే ఏమిటి? :
ఆధార్ పర్సనల్ లోన్.. మీ ఆధార్ కార్డుతో సులభంగా పొందవచ్చు. ఈ రుణం.. సాధారణ వ్యక్తిగత రుణం మాదిరిగానే ఉంటుంది. సులభమైన ప్రాసెస్ కూడా. మీ ఆధార్ కార్డ్‌తో క్షణాల వ్యవధిలో రుణాలను పొందవచ్చు. మీ ఆధార్ కార్డు ద్వారా దేశంలో వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ గుర్తింపు సమాచారమంతా మీ ఆధార్ కార్డులోనే ఉంటుంది. పర్సనల్ లోన్లు ఇచ్చేవారు మీ నుంచి అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని పొందవచ్చు. తద్వారా లోన్ ప్రాసెస్ ఈజీగా పూర్తి అయిపోతుంది.

లోన్ దరఖాస్తు ఎలానంటే? :
మీ అర్హతను ఇలా చెక్ చేయండి :
ఇంతకీ మీరు వ్యక్తిగత రుణానికి (Personal Loan)కు అర్హులు అవునా కాదా అని చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డుతో రుణాలు తీసుకునేందుకు అర్హులే. మీరు ఆన్‌లైన్‌లో రుణం ఎంత మొత్తాన్ని తీసుకోగలరో చెక్ చేసుకోండి. మీకు పర్సనల్ లోన్ ఇచ్చే సొంత వెబ్‌సైట్ ఉంటే.. మీరు త్వరగా రెండు నిమిషాల పాటు చెక్ చేసుకోవచ్చు.

ఆఫర్‌ ఉందో చెక్ చేసుకోండి :
మీ అర్హతను తనిఖీ చేసిన తర్వాత.. మీరు చేయాల్సిందల్లా ఆఫర్‌లు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి. మార్కెట్లో తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తారు. వ్యక్తిగత రుణాలపై అనేక ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇచ్చేందుకు రెడీగా ఉంటాయి. అధిక వడ్డీ రేట్లపై ఆధారపడొద్దు. మీకు ఆధార్ కార్డు ఉంటే.. భారీ సంఖ్యలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మీకు రుణాలు అందిస్తున్నారని గుర్తుంచుకోండి. మీరు చేయాల్సిందల్లా ఆయా రుణదారుల వివరాలను జాగ్రత్తగా లిస్టు చేసుకోవడమే. మీకు బెస్ట్ ఆఫర్‌ ఉందో చెక్ చేసుకోండి. అన్ని ఫైనాన్స్ సంస్థలు సొంత వెబ్ సైట్లు కలిగి ఉన్నాయి. అందులో లోన్లకు సంబంధించి వివరాలు ఉంటాయి. గూగుల్ నుంచి ఆయా వెబ్ సైట్లను విజిట్ చేసి లోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మీ ప్లాన్ ఎంచుకోండి :
మీ లోన్ టెర్మ్ ఎంతకాలం ఉండాలో ఎంచుకోవాలి. రుణం మొత్తాన్ని ఎన్నినెలల్లో చెల్లించగలరో ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు చెల్లించే మొత్తాన్ని డివైడ్ చేసుకోవాలి. ఈఎంఐ ప్రాసెస్ ఉండనే ఉంది. మీరు చెల్లించే కాలానికి వడ్డీతో రుణాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు మూడు నెలల ముందుగానే రుణం చెల్లించవచ్చని అనుకుంటే ఆ టెర్మ్ మాత్రమే ఎంచుకోండి, తద్వారా మీరు వడ్డీ రేటును ఆదా చేసుకోవచ్చు. లేదంటే ఎక్కువ మొత్తంలో ఈఎంఐ చెల్లించే ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమం. మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రుణ మొత్తాన్ని ఎంచుకోండి. అవసరానికి మించి ఎక్కువ అప్పు తీసుకోకండి. అప్పుల చిక్కుల్లో పడతారు జాగ్రత్త.

ఆన్‌లైన్‌లో అప్లయ్.. మీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి :
ఆన్ లైన్ లోనే సులభంగా అప్లయ్ చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్లను రెడీ చేసుకుని నేరుగా ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేసుకోవచ్చు. రుణం పొందాలనుకునే వెబ్ సైట్లో ఈ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసుకోవాలి. మీరు మీ రుణదాత వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయవచ్చు. మీకు పూర్తి డాక్యుమెంట్లను సరిగా అప్ లోడ్ చేయకపోతే మీ దరఖాస్తు వెంటనే తిరస్కరించే అవకాశం ఉంది. లోన్ తీసుకున్న తర్వాత తిరిగి రుణం చెల్లించే సమయంలో నిబంధనలు, షరతులు ఏమున్నాయో చెక్ చేసుకోండి. మీరు చెల్లించాల్సిన మరో రుసుము లోన్ ప్రాసెసింగ్ ఫీజు. ఇది మీ రుణదాతపై ఆధారపడి ఉంటుంది. రుణం ఆమోదించే మొత్తంలో 2శాతం నుంచి 8శాతం వరకు రేటు ఉంటుంది.
1st Dose Vaccine : 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని అర్హులందరికీ వ్యాక్సిన్ తొలి డోసు పూర్తి

మిగిలిన రుణ మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజును మొదటి నెల మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మీరు చెల్లించాల్సిన వాయిదా గడువులోగా చేయకపోతే.. పెనాల్టీ పడుతుంది. మీరు చెల్లించాల్సిన మొత్తంలో నెలకు అదనంగా 2శాతం లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సకాలంలో ఈఎంఐలను చెల్లించడం ద్వారా పెనాల్టీను నివారించవచ్చు. కొంతమంది రుణదాతలు బౌన్స్ చెక్కులపై కూడా ఛార్జ్ చేస్తారు. మీ నెలవారీ బకాయిలను చెల్లించడానికి మీరు పోస్ట్-డేటెడ్ చెక్కులను ఉపయోగిస్తున్నారా? మీ చెల్లింపును కవర్ చేయడానికి మీ అకౌంట్లో తగినంత డబ్బు ఉండేలా చూసుకోండి. లేకపోతే, మీ చెక్ బౌన్స్ అయిన ప్రతిసారి మీరు అదనంగా రూ .500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు మార్కెట్ ఆఫర్లపై ప్రాసెసింగ్ ఫీజు తీసేసి అందిస్తున్నాయి. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో లోన్లను మంజూరు చేస్తున్నాయి.

అవసరమైన డాక్యుమెంట్లు ఇవే:
ఆధార్ వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేస్తే ప్రధానంగా మూడు డాక్యుమెంట్లు అవసరం.. అందులో గుర్తింపుకార్డు, అడ్రస్ ధ్రువీకరణ, ఆదాయ పత్రం, మీ గుర్తింపుకార్డుగా మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు సమర్పించవచ్చు. ఓటరు ID, ఇండియన్ పాస్‌పోర్ట్ లేదా డ్రైవర్ లైసెన్స్ కూడా ఇవ్వొచ్చు. మీ అడ్రస్ ధ్రువీకరణ కోసం మీ యూటిలిటీ బిల్లలను కూడా సమర్పించవచ్చు. ఆదాయ ధ్రువీకరణ కోసం, మీకు గత మూడు నెలలుగా మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
Manchu Vishnu : మంచు విష్ణు చెప్తానన్న గుడ్‌న్యూస్ ఇదేనా?