Maharashtra : 15 ఏళ్లుగా మూసివున్న షాపులో మనిషి చెవులు, మెదడు, కళ్లు, అవశేషాలు..

15 ఏళ్లుగా మూసివున్న షాపులో మనిషి చెవులు, మెదడు, కళ్లు, అవశేషాలు లభ్యమయ్యాయి.

Maharashtra : 15 ఏళ్లుగా మూసివున్న షాపులో మనిషి చెవులు, మెదడు, కళ్లు, అవశేషాలు..

Human Brain And Ears, Other Body Parts Found In Closed Shop

human brain and ears, other body parts found in closed shop : 15 ఏళ్లుగా మూసి ఉన్న ఓ షాపునుంచి భయంకరమైన దర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూడగా షాకింగ్ విషయం బటపడింది. ప్లాస్టిక్ కంటైనర్ లో ఎనిమిది మనిషి చెవులు,కళ్లు,మెదడు ఉన్నాయి షాపులోపల. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో చోటుచేసుకుంది.మనిషి మెదడుతో పాటు కళ్లు, చెవులతో పాటు ముక్కు కూడా ఉంది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. షాపులో మనిషి అవయవాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ కోసం ఫోరెన్సిక్ బృందానికి అప్పగించారు. షాపు గత 15 ఏళ్లుగా మూసి ఉందని పోలీసులు తెలిపారు.

Also read : Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..

‘‘దుకాణంలో మొత్తం పాత సామాన్లు ఉన్నాయి… రెండు ప్లాస్టిక్ కంటెయినర్లు తెరిచి చూడగా మానవ మెదడు, చెవులు, కళ్లు, ముఖంలోని ఇతర భాగాలు బయటపడ్డాయని..ఈ కేసు విచారణ కొనసాగాలి అంటూ ఫోరెన్సిక్ టీమ్ రిపోర్టు తరువాత జరుగుతుందని అని నాసిక్ పోలీసులు తెలిపారు. ఈ అవయవాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? తీసుకొచ్చిన అవయవాలను ఏం చేస్తున్నారు? అనే పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా..ఆ షాపు యజమాని ఇద్దరు కుమారులు డాక్టర్లు అని పరీక్షల కోసం తీసుకొచ్చారా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా?అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసు గురించి పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగింది అని మాత్రం అనుమానించటంలేదు అని నాసిక్ పోలీస్ కమిషనర్ పూర్ణిమ చౌగులా తెలిపారు. ఈకేసు గురించి కమిషనర్ పూర్ణిమ మాట్లాడుతూ.. ‘‘స్పాట్ లో మృతదేహం కనిపిస్తే హత్యగా అనుమానిస్తాం.. కానీ ఇక్కడ లభ్యమైన ఎనిమిది చెవులను ఓ క్రమపద్దతిలో కత్తిరించడం వల్ల నిపుణులు మాత్రమే ఇలా చేయగలరు అని అభిప్రాయపడుతున్నామని తెలిపారు. కేవలం వైద్యరంగంలో ఉన్నవారే అలా కట్ చేయగలరు అని ..ఆ అవయవాలను రసాయనాల్లో భద్రపరచడంతో హత్యగా అనుమానించడం లేదు’’ అని వెల్లడించారు.

Also read : Apple Watch Tracker : గర్ల్ ఫ్రెండ్ కారుకు ఆపిల్ వాచ్.. లొకేషన్ ట్రాక్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్..!

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏంటంటే..తను మూసి ఉంచిన షాపులోకి ఆ మానవ అవశేషాలు ఎలా వచ్చాయో? ఎవరు తెచ్చారు? వంటి విషయాలు తనకు తెలియవని పోలీసులకు చెప్పటంతో కేసు కాస్త జటిలం అయ్యేలా కనిపిస్తోంది.