వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న మ‌హిళ‌తో భర్త.. న‌డిరోడ్డుపై ప‌ట్టుకున్న‌ భార్య‌

  • Published By: bheemraj ,Published On : July 13, 2020 / 07:10 PM IST
వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న మ‌హిళ‌తో భర్త.. న‌డిరోడ్డుపై ప‌ట్టుకున్న‌ భార్య‌

మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్న భర్తను..భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘ‌ట‌న ముంబైలోని పెడెర్ రోడ్డులో శ‌నివారం చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. విష‌యం తెలుసుకున్న భార్య‌.. వారిద్ద‌రిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో త‌న భ‌ర్త‌పై నిఘా పెట్టి.. కారులో వెళ్తున్న ఇద్ద‌రినీ న‌డిరోడ్డుపై ప‌ట్టుకుని నిల‌దీసింది.

ముంబైకి చెందిన ఓ మ‌హిళ‌.. త‌న భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో వివాహేతర సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేసింది. ఆమె అనుమానం నిజ‌మైంది. శ‌నివారం త‌న భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్తుండగా ఆయ‌న ప్రయాణిస్తున్న రేంజ్ రోవ‌ర్ కారును అనుస‌రించింది. ఓ మ‌హిళ‌ను కారులో ఎక్కించుకుని వెళ్తుండ‌గా.. పెడెర్ రోడ్డులో ప‌ట్టుకుంది. భార్య త‌న కారును ఆపి.. రేంజ్ రోవ‌ర్ కు అడ్డుగా వెళ్లి నిల్చుంది.

ఆగ్ర‌హంతో త‌న చెప్పు తీసుకుని కారుపైకి విసిరేసింది. బ‌య‌ట‌కు రావాల‌ని డిమాండ్ చేసింది. వారు ఎంత‌కు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో కారు బోనెట్ పై కూర్చుంది. దీంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వ‌చ్చి ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేశారు. కాగా ట్రాఫిక్ కు అంత‌రాయం క‌లిగించినందుకు మ‌హిళ‌కు పోలీసులు చ‌లాన్ జారీ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.