7 నెలల తర్వాత… విడుదలైన ఫరూక్ అబ్దుల్లా

  • Published By: venkaiahnaidu ,Published On : March 13, 2020 / 12:08 PM IST
7 నెలల తర్వాత… విడుదలైన ఫరూక్ అబ్దుల్లా

ఏడు నెలల కస్టడీ నుంచి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాట్లాడడానికి నా దగ్గర పదాల్లేవ్…ఈ రోజు నేను ఫ్రీ అయ్యాను..నేను ఫ్రీగా ఉన్నాను అని ఫరూక్ అన్నారు. అందరూ విడుదలయ్యేవరకు తాను రాజకీయ విషయాల గురించి మాట్లాడనని ఫరూక్ చెప్పారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యే ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టులో కేంద్రప్రభుత్వం రద్దు చేసే సమయంలో కశ్మీర్ లో ఎలాంటి అల్లర్లు జరుగకుండా ముందుజాగ్రత్తగా ఫరూక్ ని కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత కొన్ని రోజులకు సెప్టెంబర్ 2019లో ఫరూక్ పై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రయోగించారు. పబ్లిక్ స్టేఫ్టీ యాక్ట్ ప్రకారం ఎటువంటి విచారణ లేకుండానే రెండేళ్ల వరకు నిర్భంధంలోకి తీసుకోవచ్చు. ఈ చట్టం కింద ఇల్లే .. అనుబంధ జైలుగా పరిగణిస్తారు. ఫరూక్ పై పీఎస్ఏ చట్టంలోని “డిస్ట్రబింగ్ పబ్లిక్ ఆర్డర్”(దీని ద్వారా తక్కువగా మూడు నెలల నిర్భందం)ప్రకారం శ్రీనగర్ లోని ఆయన ఇంటిలోనే ఆయనను నిర్భందించారు.

అయితే ఆ తర్వాత మరో మూడు నెలల ఆయన నిర్భందంను పొడించారు. దీంతో ఇవాళ పొడిగించబడిన కస్టడా చివరి రోజు. ఇక ఫూరూక్ ని నిర్భందాన్ని పొడిగించకుండా ఆయనను విడుదల చేశారు. ఒక ప్రధాన స్రవంతి రాజకీయనాయకుడిపై,ముఖ్యంగా ఓ మాజీ సీఎం, లోక్ సభ ఎంపీపై పీఎస్ఏ యాక్ట్ ప్రయోగించబడింది మొదటిసారిగా ఫరూక్ పైనే. సాధారణంగా టెర్రరిస్టులపై,వేర్పాటువాదులపై,లోయలో రాళ్లు విసిరేవారిపై ఈ చట్టం ప్రయోగిస్తుంటారు. 

ఆర్టికల్ 370రద్దు సమయంలో వందలాది మంది నేతలను నిర్భంధంలోకి తీసుకోగా పలువురిని విడతల వారీగా వదిలిపెడుతూ వచ్చారు. ఏడు నెలల తర్వాత ఇవాళ(మార్చి-13,2020)ఫరూక్ అబ్దుల్లాను రిలీజ్ చేశారు. అయితే జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీ ఇంకా నిర్భందంలోనే ఉన్నారు.

See Also | 37రోజుల వరకు శరీరంలో కరోనా వైరస్ జీవించగలదట