Army Chopper Crash : ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం..త్రివిధ దళాధిపతి పరిస్థితి విషమం..అసలేం జరిగింది!

-భారత వాయుసేనకు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ వెల్లింగ్టన్ వెళ్లేందుకు సూలూర్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం మధ్యాహ్నాం టేకాఫ్ అయింది.

Army Chopper Crash : ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం..త్రివిధ దళాధిపతి పరిస్థితి విషమం..అసలేం జరిగింది!

C8

Army Chopper Crash :  – త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులు సహా ఆయన సిబ్బంది,ఇతర రక్షణ అధికారులు 9మంది బుధవారం ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి తమిళనాడులోని సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు11:45 గంటలకు చేరుకున్నారు.

-ఉదయం 11:45 గంటలకు  భారత వాయుసేనకు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ తమిళనాడులోని వెల్లింగ్టన్ వెళ్లేందుకు సూలూర్ ఎయిర్ బేస్ నుంచి  టేకాఫ్ అయింది.
–  ఈ హెలికాఫ్టర్ లో త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు.
–  వెల్లింగ్టన్ లోని ఢిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో ఉపన్యాసం ఇచ్చేందుకు సీడీఎస్ రావత్ ఈ హెలికాఫ్టర్ లో సూలూర్ నుంచి బయల్దేరారు.
– వెల్లింగ్టన్ లోని గమ్యస్థానానికి చేరడానికి 5 నిమిషాల ముందు మధ్యాహ్నాం 12:20గంటల సమయంలో హెలికాప్టర్..కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలోని కట్టేరి అనే ఊరి వద్దనున్న టీ ఎస్టేట్ లోని చిన్న ఆవాసానికి దగ్గరగా ఉన్న ఒక లోయలో కూలిపోయింది.

-ప్రమాదంలో హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోయింది
–  దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గిపోవడమే ప్రదామానికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
–  ఈ హెలికాప్టర్ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సైన్యం రంగంలోకి దిగి గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసులు,అధికారులు,స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
–  ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11మంది మృతి చెందారు. మురో ముగ్గురు ముగ్గురు తీవ్ర గాయాలతో వెల్లింగ్టన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.
– వెల్లింగ్టన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
– ఈ ప్రమాద ఘటనపై వాయుసేన విచారణకు ఆదేశించింది.

-ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌధురి..ప్రమాద ఘటన ప్రాంతాన్ని సందర్శించేందుకు ఢిల్లీ నుంచి విమానంలో బయల్దేరారు.

-మధ్యాహ్నాం 3:30గంటల సమయంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలోని బిపిన్ రావత్ నివాసానికి వెళ్లారు.

 

ALSO READ Army Chopper Crash : బిపిన్ రావత్ కండీషన్ సీరియస్..ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ ప్రకటన!