Dogs Taxed : కుక్కలను పెంచుకుంటే కూడా ట్యాక్స్ చెల్లించాల్సిందే!

మధ్యప్రదేశ్ లో మాత్రం కుక్కలను పెంచుకుంటే కూడా పన్ను విధించనున్నారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే పన్ను విధించనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.

Dogs Taxed : కుక్కలను పెంచుకుంటే కూడా ట్యాక్స్ చెల్లించాల్సిందే!

TAX

dogs taxed : దేశంలో సాధారణంగా ఇంటి పన్ను, నీటి పన్ను, ఆదాయం పన్ను వసూలు చేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం కుక్కలను పెంచుకుంటే కూడా పన్ను విధించనున్నారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే పన్ను విధించనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానాన్ని 48 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.

త్వరలో న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధి విధానాలను రూపొందించనున్నారు. సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలావుంటే నగరంలో కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.

AP Garbage tax : చెత్త పన్నుగా రూ. 100 వసూలు చేస్తే తప్పేంటీ?ఈ రాద్దాంతమేంటీ : ధర్మాన ప్రసాదరావు

బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు కుక్కలను తీసుకొచ్చి మలమూత్ర విసర్జన చేయించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రం అవుతున్నాయని పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుక్కల రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, కుక్కలను పెంచుకునే వారికి పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు.