Agnipath: అగ్నిపథ్ స్కీం నచ్చకపోతే ఆర్మీలో చేరకండి – మాజీ చీఫ్

అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) రెస్పాండ్ అయ్యారు. రిక్రూట్మెంట్ లో కొత్త పాలసీ (అగ్నిపథ్) నచ్చనప్పుడు జాయిన్ అవ్వకండి. తప్పక జాయిన్ అవ్వాలని లేదంటూ స్పందించారు.

Agnipath: అగ్నిపథ్ స్కీం నచ్చకపోతే ఆర్మీలో చేరకండి – మాజీ చీఫ్

Agnipath (1)

Agnipath: అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) రెస్పాండ్ అయ్యారు. రిక్రూట్మెంట్ లో కొత్త పాలసీ (అగ్నిపథ్) నచ్చనప్పుడు జాయిన్ అవ్వకండి. తప్పక జాయిన్ అవ్వాలని లేదంటూ స్పందించారు.

మహరాష్ట్రలోని నాగపూర్ సిటీ వేదికగా జరిగిన ఈవెంట్ లో ఇండియన్ ఆర్మీ తప్పక సైనికుల్లోకి చేరాలని చెప్పదు. అది అభ్యర్థుల ఎంపికపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

“సైన్యంలో చేరడం స్వచ్ఛందంగా జరిగేది. ఎవరి బలవంతం ఉండదు. ఎవరైనా ఆశాజనకంగా చేరాలనుకుంటే, తన ఇష్టానుసారం చేరవచ్చు, సైనికులను బలవంతం చేయం. మీకు ఈ రిక్రూట్‌మెంట్ స్కీమ్ (‘అగ్నిపథ్’) నచ్చకపోతే, అలా చేయవద్దు. చేరమని మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు? బస్సులు, రైళ్లను తగలబెడుతున్నారు. మిమ్మల్ని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారు,” అని కామెంట్ చేశారు.

Read Also: అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయాలు

అతను చేసిన కామెంట్లను వీడియో రూపంలో ట్యాగ్ చేసిన కాంగ్రెస్ మీడియా డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ పవన్ ఖేరా విమర్శలు గుప్పించారు. తన రిటైర్మెంట్ ను వాయిదా వేయాలంటూ కోర్టును ఆశ్రయించిన వ్యక్తి యువతను 23ఏళ్లకే రిటైర్ అవమంటున్నారంటూ కామెంట్ చేశారు.