జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది.

జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా

Iit Jee

IIT-JEE (Main) దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ జేఈఈ(మెయిన్)ఏప్రిల్ సెషన్ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ టెస్టింట్ ఏజెన్సీ(NTA)చేసిన ప్రకటనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఐఐటీ జేఈఈ(మెయిన్)పరీక్షకు సంబంధించి నాలుగు సెషన్లకు గాను ఇప్పటికే ఫిబ్రవరి,మార్చిలో రెండు సెషన్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడో సెషన్ పరీక్షలని నిర్వహించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ సెషన్ పరీక్షలని వాయిదా వేసినట్లు ఎన్ టీఏ తెలిపింది. కొత్త తేదీలను పరీక్ష నిర్వహించడానికి కనీసం 15రోజుల ముందు తెలయజేస్తామని ఎన్ టీఏ తన ప్రకటనలో తెలిపింది. పరీక్షకు హాజరుకావాల్సిన అభ్యర్థులు ఎన్ టీఏ అభ్యాస్ యాప్ ద్వారా ఇంటి వద్దే ఉండి ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం కల్సిస్తున్నట్లు తెలిపింది.

1

1