Ghulam Nabi Azad New Party: కొత్త పార్టీ పేరును ప్రకటించిన గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు..

కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించిన అనంతరం గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్థాపించిన పార్టీలో ‘ఏజ్ బార్’ ఉండదని, అనుభవజ్ఞులతో పాటు యువకులు పార్టీలో కలిసి పనిచేస్తారని చెప్పాడు.

Ghulam Nabi Azad New Party: కొత్త పార్టీ పేరును ప్రకటించిన గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు..

Ghulam Nabi Azad New Party

Ghulam Nabi Azad New Party: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ నూతన పార్టీని ప్రకటించారు. జమ్మూలో తాను స్థాపించబోయే కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నూతన పార్టీ పేరుకోసం దాదాపు 1500 పేర్లను ఉర్దూ, సంస్కృతంలో పరిశీలన చేసినట్లు తెలిపారు. చివరికి ఉర్దూ, హిందీ కలిపి ‘హిందుస్థానీ’ అన్నారు. ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, స్వాతంత్ర్యాన్ని ప్రతిబింబించేలా పార్టీ పేరు ఉండాలని కోరుకున్నామని, అందుకే ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టడం జరిగిందని ఆజాద్ తెలిపాడు.

Congress Crisis: గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ కమిటీ ఆగ్రహం.. అధ్యక్ష రేసు నుంచి తప్పించాలంటూ…

పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను ఆజాద్ ఆవిష్కరించారు. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో మూడు రంగులతో జెండాను రూపొందించారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ఎజెండా అని ఆజాద్ అన్నారు. ప్రస్తుతం తన పార్టీ జమ్మకశ్మీర్ కే పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా విస్తరించే విషయంపై ఆలోచిస్తానని ఆజాద్ ఇప్పటికే చెప్పారు. అయితే ఆదివారం తన మద్దతుదారులతో ఆజాద్ సమావేశాలు నిర్వహించిన అనంతరం సోమవారం పార్టీ పేరు, జెండా వివరాలను వెల్లడించారు. పార్టీ ప్రకటన అనంతరం ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్థాపించిన కొత్త పార్టీలో ‘ఏజ్ బార్’ ఉండదని, యువకులు, అనుభవజ్ఞులు పార్టీలో కలిసి పనిచేస్తారని తెలిపాడు.

Rupee Falls: మరింత పతనమైన రూపాయి విలువ.. డాలరుతో అత్యంత కనిష్టానికి చేరిక.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

సుధీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన 73ఏళ్ల ఆజాద్ ఇటీవల ఆగస్టు 26న ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వీడిన సమయంలో సోనియాగాంధీకి లేఖ రాసిన ఆజాద్ అందులో రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆజాద్ రాజీనామాకు మద్దతు జమ్ముకశ్మీర్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుండి వైదొలిగిన తర్వాత జమ్మూలో తన మొదటి బహిరంగ సభలో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, అక్కడి నివాసితుల ఉద్యోగ హక్కుల పునరుద్ధరణపై దృష్టి సారించేలా తాను సొంత రాజకీయ పార్టీని పెడతానంటూ ఆజాద్ వెల్లడించాడు. అనుకున్నట్లుగా ఆజాద్ సోమవారం తన కొత్త పార్టీ పేరు ప్రకటించడంతో పాటు పార్టీ జెండాను ఆజాద్ ఆవిష్కరించారు.