Independence Day 2023 : పోస్టాఫీసుల్లో రూ.25కే త్రివర్ణ పతాకం, ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి

ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా జాతీయ జెండాలను పొందాలనుకునేవారు డిపార్ట్‌మెంట్ ఇ-పోస్టాఫీసు సౌకర్యం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి ఇంటి త్రివర్ణ ప్రచారం 13 ఆగస్టు నుంచి 15 ఆగస్టు 2023 వరకు కొనసాగుతుంది..

Independence Day 2023 :  పోస్టాఫీసుల్లో రూ.25కే త్రివర్ణ పతాకం, ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి

Indian national flag At Post Office

Indian national flag At Post Office : స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు భారత (Independence Day 2023 )సిద్దమైంది. ఇక ప్రతీ భారతీయుడు మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు భారతీయులు సిద్దమవుతున్నారు. ప్రతీ ఇంటికి త్రివర్ణ ప్రచారం కోసం కేంద్రం ప్రభుత్వం జాతీయ జెండాల(indian national flag)ను అందించేందుకు పోస్టాఫీసులు వేదిక కానున్నాయి. పోస్టాఫీసుల్లో జాతీయ జెండాలను రూ.25లకే అందించనుంది. ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు 1.60 లక్షల పోస్టాఫీసుల (Post Office)ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది.

ఆల్-ఇండియా రేడియో న్యూస్ అధికారిక ట్వీట్ ప్రకారం.. ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా జాతీయ జెండాలను పొందాలనుకునేవారు డిపార్ట్‌మెంట్ ఇ-పోస్టాఫీసు సౌకర్యం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి ఇంటి త్రివర్ణ ప్రచారం 13 ఆగస్టు నుంచి 15 ఆగస్టు 2023 వరకు కొనసాగుతుంది..

Independence Day 2023 : భారత్‌తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకునే దేశాలు

భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. దీంతో భారతదేశం తన 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. దీంతో దేశమంతా మువ్వన్నెల జెండాతో మురిసిపోనుంది. హర్ ఘర్ తిరంగా ప్రచారం (Har Ghar Tiranga campaign)2.0లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో భారత జాతీయ జెండాను విక్రయిస్తు భారత పౌరువులకు అందుబాటులోకి తేనున్నారు. భారత పౌరులందరూ తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయానికి తగిన ప్రోత్సాహాలను అందించేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. తపాలా శాఖ తన వెబ్ పోర్టల్ ద్వారా జాతీయ జెండాను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నామని ప్రకటించింది.

ఇండియా పోస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో జెండాను ఎలా కొనుగోలు చేయాలి?
ముందుగా పోస్టాఫీసు వెబ్‌సైట్‌కి వెళ్లండి.. హర్‌ గర్‌ తిరంగ పై క్లిక్‌ చేయండి..అక్కడ లాగిన్‌ అవ్వండి
ప్రోడక్ట్‌లు కింద ‘జాతీయ పతాకం’పై క్లిక్ చేయండి..
అక్కడ కొనుగోలుపై క్లిక్‌ చేసి మొబైల్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయండి.
అలాగే మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి..
ప్రొసీడ్ ఫర్ పేమెంట్’ ఎంపికపై క్లిక్ చేయండి..
చెల్లింపు విధానాన్ని ఉపయోగించి రూ. 25 చెల్లించండి..

కాగా..త్రివర్ణ పతాకాన్ని ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. దీని కోసం చేయాల్సిందల్లా..మీరు త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయడానికి సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి..నామమాత్రపు ధరకు అంటే కేవలం రూ.25 చెల్లించి జాతీయ జెండా పొందవచ్చు..లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.