Vaccination Record: మోడీ పుట్టినరోజు నాడే దేశంలో వ్యాక్సినేషన్ రికార్డ్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మరో వ్యాక్సినేషన్ రికార్డును సాధించినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సంతోషం వ్యక్తం చేశారు.

10TV Telugu News

COVID-19 Vaccination Record: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మరో వ్యాక్సినేషన్ రికార్డును సాధించినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ‘వ్యాక్సిన్ సర్వీస్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు, భారతదేశం 20 మిలియన్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్‌లను వేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

వ్యాక్సిన్ సేవ ‘ప్రచారం రోజున, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హాస్పిటల్‌లో వ్యాక్సిన్‌లు వేసే క్యాంపెయిన్‌ని పరిశీలిస్తున్నప్పుడు, సాయంత్రం 5 గంటలకు ఒక రోజులో 2 కోట్ల వ్యాక్సిన్‌ల సంఖ్యను దాటింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన ఈ విజయం పట్ల ఆరోగ్య మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పిడికిలి బిగించి గాలిలో చేయి పైకెత్తి, మేం సాధించాం అంటూ నినాదం చేశారు ఆరోగ్యమంత్రి.

ఆరోగ్య కార్యకర్తలకు అభినందనలు:
ఈ విజయానికి, వ్యాక్సిన్ ప్రచారంలో నిమగ్నమైన ఆరోగ్య కార్యకర్తలు కారణమని, ఆరోగ్య కార్యకర్తలు ప్రతీ ఒక్కరినీ అభినందించారు. మీ కృషితో దేశం ఈ విజయాన్ని సాధించగలిగింది అని అన్నారు. మన్సుఖ్ మాండవియా సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో వ్యాక్పిన్ ప్రచారంలో నిమగ్నమైన ఆరోగ్య కార్యకర్తలందరికీ స్వీట్ తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. దేశంలోని ఈ గొప్ప విజయంకి తోడ్పాటు అందించిన సేవా సహచరులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేశారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా రెండు కోట్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. వారి టార్గెట్‌ను కేంద్రం సాధించింది.