ప్రపంచంలో India ఆర్థికంగా వెనుకబడి ఉంది: నోబెల్ విన్నర్ బెనర్జీ

ప్రపంచంలో India ఆర్థికంగా వెనుకబడి ఉంది: నోబెల్ విన్నర్ బెనర్జీ

నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం India ఎకానమీ పరంగా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో వివరించారు. Covid-19 మహమ్మారి రాకముందే ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయామని అన్నారు. ప్రస్తుతమున్న ఫిస్కల్ లో జులై-సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి కనిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.




‘2017-18లో 7ఫీఎస్డీ.. 2018-19 నాటికి 6.1శాతానికి పడిపోయింది. అదే 2019-20 సంవత్సరం అవసరమైన దాని కంటే చాలా తక్కువగా 4.2శాతానికి దిగజారిపోయింది. ఇండియన్ ఎకానమీ ప్రపంచంలోని దారుణమైన దేశాల్లో ఒకటిగా ఉంది. జులై-సెప్టెంబర్ (ప్రస్తుత క్వార్టర్)లో పరిస్థితులు ఎలా ఉంటాయో గమనించాలి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం.’ అని బెనర్జీ అన్నారు.

బెనర్జీ ప్రస్తుతం మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ)లో ప్రొఫెసర్ గా పనిచేస్తు్నారు. ‘నాకు తెలిసి భారత ఆర్థికాభివృద్ధి దేశానికి సరిపడ మొత్తంలో లేదు. ఇంకా వృద్ధి సాధిస్తేనే గానీ దీని నుంచి బయటపడలేం. ప్రభుత్వం చేస్తున్నట్లుగా తక్కువ ఆధాయం సంపాదిస్తున్న వారు చేతుల్లో సంపదను దాచుకోకుండా ఖర్చు పెట్టేస్తున్నారు’ ఇవే చెప్తున్నాయి ఆర్థిక లోటుపాట్ల గురించని అన్నారు.




ఇండియా గత 20ఏళ్లుగా చాలా ఎదిగింది. స్థిరమైన ఎదుగుదల, వృద్ధితో బెనిఫిట్లు సాధించింది. దాంతో పాటు ఇండియాకు ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీపడి మరింత వృద్ధి చెందాల్సిన అవసరముందని ఎకానమిస్ట్ అంటున్నారు.