Cheetahs In India: ఏడు దశాబ్దాల తర్వాత దేశంలో జన్మించబోతున్న చీతా.. ‘ఆశా’ గర్భిణి అంటున్న అధికారులు

ఇటీవలే దేశంలోకి వచ్చిన చీతాల్లో ఆశా అనే ఆడ చీతా గర్భంతో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే దేశంలో ఒక చీతా జన్మించడం ఏడు దశాబ్దాల తర్వాత మొదటిసారి అవుతుంది. క్రమంగా చీతాల సంఖ్య పెరుగుతుంది.

Cheetahs In India: ఏడు దశాబ్దాల తర్వాత దేశంలో జన్మించబోతున్న చీతా.. ‘ఆశా’ గర్భిణి అంటున్న అధికారులు

Cheetahs In India: ఇటీవలే నమీబియా నుంచి మన దేశంలోకి అడుగుపెట్టిన చీతాలకు సంబంధించి గుడ్ న్యూస్ రానుందంటూ అధికారులు చెబుతున్నారు. ఆశా అనే ఆడ చీతా గర్భంతో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం

నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది చీతాల్లో మూడు ఆడ చీతాలు, ఐదు మగ చీతాలు ఉన్నాయి. వీటిలో ఒక ఆడ చీతాకు ప్రధాని మోదీ ‘ఆశా’ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఆశా గర్భంతో ఉందని అధికారుల అంచనా. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఈ చీతాలు అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంటున్న సంగతి తెలిసిందే. వీటిని ట్రాకర్ల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఆశా అనే చీతాకు సంబంధించి ప్రస్తుతం కొన్ని మార్పుల్ని అధికారులు గుర్తించారు. ఆశా ప్రవర్తనతోపాటు, హార్మోనల్, ఫిజికల్ మార్పులను బట్టి ఆశా గర్భంతో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

GST collections: 26 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబర్‌లో రూ.1.47 లక్షల కోట్లు వసూలు

ఇదే నిజమైతే దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత దేశంలో ఒక చీతా జన్మించినట్లవుతుంది. త్వరలో ఈ విషయంపై అధికారులకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే చీతా గర్భంతో ఉన్నట్లు తేలితే… ఆశాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్పారు. తన ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా, ప్రత్యేక వసతి ఏర్పాటు చేస్తామని, జనాలను ఆశాకు దూరంగా ఉంచుతామని అన్నారు.