Hybrid Flying Car : ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్ల‌యింగ్ కారు వచ్చేస్తోంది, మేడిన్ ఇండియా

రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్ గోల, పొల్యూషన్ బాధ లేకుండా ఎంచక్కా మన కారు గాల్లో ఎగిరిపోగ‌లిగితే ఎంత బావుంటుందో కదా. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. అదే నిజమైతే బాగుంటుంది కదూ.

10TV Telugu News

Hybrid Flying Car : రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్ గోల, పొల్యూషన్ బాధ లేకుండా ఎంచక్కా మన కారు గాల్లో ఎగిరిపోగ‌లిగితే ఎంత బావుంటుందో కదా. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. అదే నిజమైతే బాగుంటుంది కదూ. ఎందుకు కాదు, త్వరలోనే మ‌నం దాన్ని నిజం చేసుకోవ‌చ్చు. అవును, ఎగిరిపోయే కార్లు వ‌చ్చేస్తున్నాయి. అదీ మ‌న భార‌త్‌లోనే త‌యార‌వుతున్నాయి.

Paytm బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్, కండీషన్స్ అప్లయ్

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైకి చెందిన స్టార్ట‌ప్ విన‌తా ఏరోమొబిలిటీ కంపెనీ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు ఫ్లయింగ్ కారును త‌యారు చేస్తోంది. ఇది ఇండియాలోనే కాదు ఆసియాలోనే త‌యార‌వుతున్న తొలి ఎగిరే కారు. లండ‌న్‌లో జ‌ర‌గ‌నున్న హెలిటెక్ ఎక్స్‌పో 2021లో ఈ హైబ్రిడ్ ఫ్ల‌యింగ్ కారు మోడ‌ల్‌ను, పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

ఇప్పటికే ఈ కారు న‌మూనాను వినతా కంపెనీ.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు చూపించింది. ఈ మోడ‌ల్‌పై సింథియా కూడా సానుకూలంగా స్పందించారు. ఒకసారి ఈ కారు అందుబాటులోకి వస్తే ప్ర‌జా ప్ర‌యాణంతో పాటు కార్గో, మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల కోసం కూడా వినియోగించ‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ

హైబ్రిడ్ కారు అంటే..
హైబ్రిడ్ కారు అంటే సాధార‌ణ కారులాగే ఉంటుంది. కాక‌పోతే ఈ కారులో రెండు ఇంజిన్‌లు ఉంటాయి. అందులో ఒక‌టి పెట్రోల్ లేదా డీజిల్‌ తో న‌డుస్తుంది. ఇంకొక‌టి ఎల‌క్ట్రిక్ మోటార్‌. ఇలా ఇంధ‌నం, ఎల‌క్ట్రిక్ పద్ధ‌తి రెండింటినీ వాడే టెక్నిక్‌నే హైబ్రిడ్ అంటారు. ఇప్పుడు చాలా కంపెనీలు ఇలాంటి కార్ల‌పై ప‌ని చేస్తున్నాయి.

హైబ్రిడ్ ఫ్ల‌యింగ్ కారు స్పెషాలిటీ..
* ఈ హైబ్రిడ్ ఫ్ల‌యింగ్ కారు ముందు భాగం బుల్లెట్ ట్రైన్ డిజైన్‌లో ఉంటుంది.
* దీనికి నాలుగు చ‌క్రాల‌తో పాటు.. గాలిలోకి ఎగిరేందుకు రెక్క‌లు కూడా ఉన్నాయి.
* కారు చుట్టూ న‌ల్ల‌టి గ్లాస్‌ను ఉప‌యోగించారు.
* విద్యుత్ తో పాటు బ‌యో ఫ్యూయ‌ల్‌తో న‌డుస్తుంది. దీనివ‌ల్ల ఎగిరే సామ‌ర్థ్యం పెరుగుతుంది.
* ఈ కారులో ఇద్ద‌రు ప్ర‌యాణికులు వెళ్ల‌వ‌చ్చు.
* కారు బ‌రువు 1100 కిలోలు.
* గ‌రిష్టంగా 1300 కిలోల వ‌ర‌కు మోసుకెళ్ల‌గ‌ల‌దు.
* ఈ కారు గంట‌కు 100-120 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది.
* కారు రోట‌ర్ కాన్ఫిగ‌రేష‌న్ కో ఆక్సియ‌ల్ క్వాడ్ రోట‌ర్‌.
* ఈ కారులో జీపీఎస్ ట్రాక‌ర్‌, ప‌నోర‌మిక్ విండో కూడా ఉంటాయి.

అయితే ఈ ఫ్ల‌యింగ్ కారు లోప‌లి భాగానికి సంబంధించిన న‌మూనాను మాత్రం ఇంకా రివీల్ చేయ‌లేదు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అక్టోబర్‌లో లండ‌న్‌లో జ‌ర‌గ‌బోయే ఆటోమొబైల్ ఎక్స్‌పోలో ప్ర‌క‌టించ‌నున్నారు.

10TV Telugu News