India Covid : మళ్లీ హడలెత్తిస్తున్న కోవిడ్ .. 24 గంటల్లో 20 శాతం పెరిగిన కొత్త కేసులు,13 మంది మృతి

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. మళ్లీ మాస్క్ తప్పదా? అనేలా ఏడు నెలల తరువాత భారతదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.

India Covid : మళ్లీ హడలెత్తిస్తున్న కోవిడ్ .. 24 గంటల్లో 20 శాతం పెరిగిన కొత్త కేసులు,13 మంది మృతి

New Covid Cases In India

India Covid  : దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. మళ్లీ మాస్క్ తప్పదా? అనేలా చేస్తున్నాయి. ఏడు నెలల తరువాత భారతదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంట్లో భాగంగా బుధవారం (మార్చి5,2023) కంటే 20 శాతం పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 5335 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా 13మంది మృతి చెందారు. దీంతో మరోసారి కోవిడ్ మహమ్మారిని భయాందోళనలకు గురిచేస్తోంది.

దేశంలో కేరళ,కర్ణాటక,మహారాష్ట్ర,గుజరాత్,ఢిల్లీ,హర్యానా,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త వేరియంట్లుగా మారి భయపెడుతున్న కోవిడ్ మహమ్మారి తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,47,39,054 కేసులు నమోదు 5,30,929 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు.

అలాగే దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతంగా ఉంది. కొత్త కోవిడ్ కేసులు నమోదు అవుతున్నా..గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 2826 మంది కోలుకోవటం ఆశాజనకంగా ఉంది. కరోనాపై విజయం సాధించామని ధైర్యంగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్లూ రూపంలో కొత్త భయాలు వెంటాడుతున్నాయి. కాబట్టి ముందస్తు జాగ్రత చర్యలుగా మాస్కులు ధరించటం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.