COVID-19: ఐదు నెలల తరువాత గరిష్ఠ స్థాయిలో.. ఒకేరోజు 2వేలకు‌పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2,151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదు నెలల కాలంలో 2వేల మార్క్ దాటడం ఇదే తొలిసారి.

COVID-19: ఐదు నెలల తరువాత గరిష్ఠ స్థాయిలో.. ఒకేరోజు 2వేలకు‌పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

coronavirus

COVID-19: దేశంలో కోవిడ్ -19 (Covid-19)  కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారంరోజుల వ్యవధిలోనే రోజువారి కేసుల సంఖ్య వెయ్యి నుంచి 2వేల మార్క్‌కు చేరింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry)  వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2,151 పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. ఈ గణాంకాలు గడిచిన ఐదు నెలల్లో అత్యధికమని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది అక్టోబర్ 28న 2,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ రోజువారి కరోనా కేసులు 2వేల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. దేశంలో మంగళవారం ఉదయం వెల్లడైన వివరాల ప్రకారం.. కొత్తగా 1,573 కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 500 అదనంగా పాజిటివ్ కేసులు నమోదు కావడం దేశంలో కొవిడ్ ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

COVID-19: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. వరుసగా రెండోరోజు 1800 కొత్త కేసులు.. 10వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,903కు చేరింది. కోవిడ్ -19 కారణంగా 24గంటల్లో ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలుపుకొని దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 5,30,848కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ముగ్గురు చొప్పున, కర్ణాటకలో ఒకరు కొవిడ్ వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. యాక్టివ్ కేసులు 0.03 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.73శాతంగా నమోదైంది.

COVID-19: భారీగా పెరిగిన కోవిడ్ కేసులు.. ఒకే రోజు 1,890 కేసులు నమోదు.. ఐదు నెలల తర్వాత ఇదే అధికం

కోవిడ్ -19 కేసులు సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మందులు, వైద్య పరికరాలు, ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలపై మానవ వనరుల సామర్థ్యం పెంపుదల, టీకా పంపిణీ వంటి వాటిని సంసిద్ధం చేసుకోవాలని ఇటీవల జరిగిన సమీక్షలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.