India Corona : ఇండియాకు బిగ్ రిలీఫ్.. తగ్గిన కరోనా కేసులు, వరసగా 15వరోజు రికవరీలే ఎక్కువ

కరోనా మహమ్మారి విలయంతో విలవిలాడిన భారత్ కు ఇది ఊరటనిచ్చే అంశం. దేశంలో కరోనా వైరస్ తీవ్రత అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడి కోసం రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి.

India Corona : ఇండియాకు బిగ్ రిలీఫ్.. తగ్గిన కరోనా కేసులు, వరసగా 15వరోజు రికవరీలే ఎక్కువ

India Corona

India Corona Cases : కరోనా మహమ్మారి విలయంతో విలవిలాడిన భారత్ కు ఇది ఊరటనిచ్చే అంశం. దేశంలో కరోనా వైరస్ తీవ్రత అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడి కోసం రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా రెండులక్షల లోపు కొత్తకేసులు నమోదయ్యాయి. 44 రోజుల్లో తొలిసారిగా రోజువారీ కేసులు కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రెండోరోజు మరణాలు 4 వేల దిగువనే నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు తగ్గుతూ, రికవరీ రేటు మెరుగుపడుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం(మే 28,2021) గణాంకాలు విడుదల చేసింది.

గురువారం(మే 27,2021) 20లక్షల 70వేల 508 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..ఒక లక్ష 86వేల 364మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. సుమారు 44 రోజుల తర్వాత మొదటిసారి రోజూవారీ కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ 13న 1,84,372 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2.75కోట్లకుపైబడింది. ఇక 24గంటల వ్యవధిలో మరో 3వేల 660మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 3,18,895మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మరణాల రేటు 1.15 శాతంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23లక్షల 43వేల 152 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 8.84 శాతానికి చేరింది. కొత్త కేసులు అదుపులోకి వస్తుండటంతో ఈ తగ్గుదల కనిపిస్తోంది. రోజురోజుకూ రికవరీల సంఖ్య మెరుగ్గా ఉంటోంది. నిన్న ఒక్కరోజే 2లక్షల 59వేల 459మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీరేటు 90.01 శాతానికి చేరుకుంది. మొత్తంగా 2.48కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించారు. వరసగా 15వరోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ.