మొదటిసారి T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైన‌ల్‌లో భారత్

  • Published By: madhu ,Published On : March 5, 2020 / 06:04 AM IST
మొదటిసారి T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైన‌ల్‌లో భారత్

కొన్ని మ్యాచ్‌లు జరగకుండానే ఫలితాలను నిర్దేశిస్తాయి. తాజాగా T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైన‌ల్‌లో ఇదే చోటు చేసుకుంది. మహిళల పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు సెమీఫైనల్ చేరిన టీమిండియా..ఒక్కసారి కూడా ఫైనల్‌లో చోటు దక్కించుకోలేదు. తాజాగా వర్షం పుణ్యమా..అని డైరెక్ట్‌గా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. 2020, మార్చి 05వ తేదీ సిడ్నీ వేదికగా భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.

కానీ నిరంతరంగా వర్షం కురుస్తూనే ఉంది. చివరకు అంపైర్లు మ్యాచ్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. లీగ్ దశలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో అన్నిమ్యాచ్‌లు గెలిచి గ్రూప్ – Aలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 8 పాయింట్లు ఉండగా, ఇంగ్లండ్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.

మధ్యాహ్నం ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం వస్తే..దక్షిణాఫ్రికా జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. 2020, మార్చి 08వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 

Read More : ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత