Fujii Kaze: ఇండియన్ కల్చర్ గురించి జపాన్ గాయకుడి పాట.. మెచ్చుకుంటున్న ఇండియన్స్

ఇండియన్ కల్చర్ గురించి జపాన్ గాయకుడు పాట రూపొందించాడు. ఫ్యుజి కాజె అనే జపాన్ సింగర్ మన కల్చర్ గురించి రూపొందించిన ఈ పాట ఇప్పుడు వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

Fujii Kaze: ఇండియన్ కల్చర్ గురించి జపాన్ గాయకుడి పాట.. మెచ్చుకుంటున్న ఇండియన్స్

Fujii Kaze: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని అనేక దేశాలు ఇష్టపడతాయి. విదేశీయులెందరో గౌరవించే గొప్ప సంస్కృతి మనది. అందుకే జపాన్‌కు చెందిన ఒక యువ గాయకుడు మన కల్చర్‪పై ఏకంగా ఒక మ్యూజిక్ వీడియో రూపొందించాడు.

Twitter: 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్న ట్విట్టర్.. కారణమిదే!

ఫ్యుజి కాజె అనే జపాన్ సింగర్ ఇటీవల ‘గ్రేస్’ పేరుతో ఒక మ్యూజిక్ వీడియో రూపొందించాడు. ఈ వీడియోను మన దేశంలోనే తీశాడు. ఉత్తరాఖండ్‌లోనే పూర్తిగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట నేపథ్యం, లిరిక్స్ అన్నీ మన కల్చర్‌ను ప్రతిబింబిస్తాయి. ఫ్యుజి ఒక ప్రైవేటు ప్రాజెక్టులో భాగంగా ఈ వీడియో రూపొందించాడు. ఫ్యుజికి జపాన్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. మ్యుజిషియన్‌గా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన రూపొందించిన ‘గ్రేస్’ వీడియో కూడా మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. గత అక్టోబర్‪లో రిలీజైన ఈ పాటకు ఇప్పటికే యూట్యూబ్‌లో 11 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కడం విశేషం.

Viral Video: వీడెవడండీ బాబు… మొసలిలాగా డ్రెస్ వేసుకుని, మొసలితోనే ఆటలు.. షాకింగ్ వీడియో

సంగీతాభిమానుల్ని ఈ పాట ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారతీయులు ఈ పాటను బాగా ఇష్టపడుతున్నారు. జపనీస్ అయ్యుండి, ఇండియన్ కల్చర్ గురించి పాట రూపొందించిన ఫ్యుజిని మనవాళ్లు ప్రశంసల్తో ముంచెత్తుతున్నారు. ఈ పాట ఇక్కడి ప్రజల డైలీ లైఫ్‌ను చూపించడం బాగా నచ్చింది. మన టీ షాపులు, దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు వంటి వాటిని ఈ పాటలో చూపించారు.