R Value : పెరుగుతున్న ఆర్ వ్యాల్యూ..థర్డ్ వేవ్ సంకేతమా!

భారత్ ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది.

R Value : పెరుగుతున్న ఆర్ వ్యాల్యూ..థర్డ్ వేవ్ సంకేతమా!

R Value

India’s R Value Rises To 1.17, Driven By Rise In Infections In Kerala & Maharashtra  భారత్ ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది. ఒక రోగి నుంచి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే సగటు వ్యక్తుల అంచనాను ఆర్‌-వ్యాల్యూగా పేర్కొంటారు. గడిచిన వారం రోజులుగా ఆర్ వ్యాల్యూ పెరిగిందని.. ప్రస్తుతం ఆర్-విలువ 1.17 ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. గత వారం భారత్ ఆర్ వాల్యూ 0.083కి పడిపోగా..కేరళ,మహారాష్ట్రలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు..దేశవ్యాప్త ఆర్ వాల్యూ పెరుగుదలకు కారణమైంది. చివరిగా భారత్ లో చివరిగా ఆర్ వ్యాల్యూ మార్చి-19,2021న అత్యధికంగా 1.19గా ఉండింది. దీని తర్వాతనే దేశంలోనే సెకండ్‌ వేవ్ విరుచుకుపడిన విషయం తెలిసిందే.

ఆర్- ఫ్యాక్ట‌ర్ అంటే ఏంటీ
ఆర్- ఫ్యాక్ట‌ర్ అంటే రీ-ప్రోడ‌క్ష‌న్ రేటు. ఒక కోవిడ్ రోగి ఎంత‌మందికి కోవిడ్ స్ప్రెడ్ చేయ‌గ‌ల‌డు అనేది ఈ రీ- ప్రొడ‌క్ష‌న్ రేటు చెబుతుంది. ఆర్- ఫ్యాక్ట‌ర్ క‌నుక 1.0 కంటే ఎక్కువ ఉంటే కేసులు ఎక్కువ‌ అవుతున్న‌ట్టు లెక్క‌. అదే స‌మ‌యంలో ఆర్- ఫ్యాక్ట‌ర్ 1.0 క‌న్నా త‌క్కువ ఉన్నా.. కేసుల‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తున్నా.. పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న‌ట్టు భావించాల‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు, ఒక వంద‌ మంది కోవిడ్ బాధితుల ద్వారా మ‌రో వంద‌మందికి క‌రోనా సోకిందంటే.. అప్పుడు ఆర్- ఫ్యాక్టర్‌ విలువ ఒకటిగా ఉంటుంది. అదే వంద‌మంది కేవ‌లం 80 మందికి మాత్ర‌మే వైరస్‌ను వ్యాపింప‌చేయ‌గ‌లిగితే అప్పుడు ఆర్‌- ఫ్యాక్టర్‌ 0.80కు ప‌రిమిత‌మ‌వుతుంది.

రాష్ట్రాల్లో ఆర్‌-వ్యాల్యూ
కేరళలో గత వారం ఆర్‌-వ్యాల్యూ 0.87 గా నమోదవగా.. ఈ వారం 1.33 కి పెరిగింది. అదేవిధంగా, గత వారం 0.87 వద్ద ఉన్న ఆర్‌ విలువ మహారాష్ట్రలో, 1.06 కి పెరిగింది. జమ్ముకశ్మీర్‌లో గత వారం 0.85 నుంచి ఈ వారం 1.25 కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం 0.87 నుంచి ఈ వారం 1.09 కు చేరింది. మిగతా రాష్ట్రాలు 1 కంటే తక్కువగా ఆర్‌-వ్యాల్యూను కలిగి ఉన్నాయి., మణిపూర్‌ రాష్ట్రంలో ఆర్‌-వ్యాల్యూలో పెరుగుదల కనిపిస్తున్నది. గత వారం ఇక్కడ 0.8 గా ఉండగా, ఈ వారం 0.93 కి పెరిగిది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో గత వారం 0.74 నుంచి ఈ వారం 0.78 కు పెరుగగా.. అసోంలో గత వారం 0.95 నుంచి 0.87 కు తగ్గింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఆర్‌-వ్యాల్యూలో ఎలాంటి మార్పులేదు. మిజోరాంలో ఇప్పుడు అత్యధికంగా ఆర్‌-వ్యాల్యూ 1.36 గా ఉన్నది. గత వారం ఇక్కడ ఆర్‌ విలువ 0.67 గా ఉండేది.

భారతదేశంలో ప్రస్తుతం ఆర్‌ వ్యాల్యు పెరుగుతుందని, థర్డ్‌ వేవ్ భయం గతంసారి కంటే చాలా ఎక్కువగా ఉంటుందని,దేశం మొత్తం మీద పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకుడు సీతాభ్రా సిన్హా తెలిపారు. ఆగష్టు 2 నాటికి మొత్తం ఆర్‌-విలువ 1.03 కి పెరిగింది. అయితే, తదుపరి వారం 1 కంటే దిగువకు పడిపోయిందని సీతాభ్రా సిన్హా అన్నారు.
.