IT Raids : మధ్యప్రదేశ్‌లో ఐటీ దాడులు.. అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంకులో దాచిన రూ.8కోట్లు, నగలు సీజ్

శంకర్‌ రాయ్‌ ఆస్తులపై 200మంది ఐటీ అధికారులతో పాటు పోలీసులు గురువారం ఉదయం 5గంటల నుంచి దాడులు చేశారు. శంకర్ రాయ్ కుటుంబానికి చెందిన పదికి పైగా స్థలాలపై సోదాలు జరిపారు.

IT Raids : మధ్యప్రదేశ్‌లో ఐటీ దాడులు.. అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంకులో దాచిన రూ.8కోట్లు, నగలు సీజ్

It Raid (1)

IT officials raid businessman’s house : మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యాపారవేత్త ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయగా భారీగా నగదు పట్టుబడింది. పన్ను ఎగవేత ఆరోపణలపై వ్యాపారవేత్త శంకర్‌ రాయ్‌ ఇంటిపై దాడులు చేయగా.. నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా ఇంట్లోని అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంకులో డబ్బును దాచిపెట్టాడు ఆ వ్యాపారవేత్త. దీంతో ఆ డబ్బును చూసిన అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు.

8కోట్ల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నీటిలో డబ్బును దాచిపెట్టడంతో అదంతా నానిపోయింది. దీంతో ఆ నోట్ల కట్టలను ఆరబోశారు. ఐరన్‌ బాక్సుతో వాటిని ఎండబెట్టారు. ఈ నగదుతో పాటు 5కోట్ల రూపాయల విలువైన నగలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Andhra Pradesh : ఆత్మకూరులో టెన్షన్..టెన్షన్

శంకర్‌ రాయ్‌ ఆస్తులపై 200మంది ఐటీ అధికారులతో పాటు పోలీసులు గురువారం ఉదయం 5గంటల నుంచి దాడులు చేశారు. శంకర్ రాయ్ కుటుంబానికి చెందిన పదికి పైగా స్థలాలపై సోదాలు జరిపారు. దాదాపు 40గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లోనే భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

దీంతో పాటు శంకర్‌రాయ్‌ కుటుంబం మరేదైనా ప్రాంతంలో ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారమిస్తే 10వేల రూపాయల రివార్డు ఇస్తామని ఐటీ శాఖ ప్రకటించింది. రాయ్‌ కుటుంబం నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.