ITR filing : ఐటీ రిటర్న్స్‌లో తప్పులా? గడువులోగా సరిదిద్దుకోండిలా.. ఫైన్ పడుద్ది..!
గత ఆర్థిక ఏడాదికి (2021-22) సంబంధించి ఐటీ రిటర్న్స్ గడువు ముగియనుంది. అప్పటిలోగా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ క్లియర్ చేయకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Itr Filing For Ay 2022 23 How To Correct Error In Form 26as
ITR filing : గత ఆర్థిక ఏడాదికి (2021-22) సంబంధించి ఐటీ రిటర్న్స్ గడువు ముగియనుంది. అప్పటిలోగా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ క్లియర్ చేయకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది పన్నుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు తేదీ ముగిసేవరకు నిర్లక్ష్యంగా ఉంటుంటారు. అలా చేయడం సరికాదు.. ఎందుకంటే.. అనవసరంగా రూ.5వేల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. గడువు తేదీ దగ్గరపడితే.. అప్పటికప్పుడు ఐటీ రిటర్న్స్ సమర్పించేందుకు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఐటీ రిటర్న్స్ దాఖలులో అనేక తప్పులు దొర్లుతుంటాయి. ఈ నెలాఖరులోగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ తప్పక సమర్పించాలి. ఐటీ రిటర్న్స్ దాఖలులో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా దాఖలు చేయాలి.
చివరి క్షణంలో ఐటీ రిటర్న్స్ సమర్పిస్తే.. అనేక తప్పులు దొర్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆయా తప్పులను చెక్ చేసుకోవడం కుదరదు. అందుకే పూర్తిగా ఐటీ రిటర్న్స్ గడువు ముగియకముందే.. ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ముందుగానే ఐటీ రిటర్న్స్ సమర్పించినా.. తప్పొప్పులను సవరించుకునేందుకు సమయం ఉంటుంది. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. ఒక సవరణ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్‌లో తప్పొప్పులను సవరించేందుకు ఐటీ చట్టంలోని 26AS ఫామ్ సబ్మిట్ చేయాలి. గడువు ముగిసే సమయంలో ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తే.. ఆయా సవరణలకు సమర్పించే 26AS ఫామ్ సబ్మిట్ చేయడం ఆలస్యం కావొచ్చు. గడువు దాటిన తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు తప్పనిసరిగా రూ.5000 జరిమానా చెల్లించాలి.

Itr Filing For Ay 2022 23 How To Correct Error In Form 26as
ఇక, సవరణలతో ఫామ్ 26ASను కన్సాలిడేటెడ్ స్టేట్‌మెంట్ అని పిలుస్తారు. నిర్దిష్ట పరిమితిని మించి లావాదేవీలు జరిపినప్పుడు ఆయా సంస్థలు వివరాలను ఆదాయం పన్ను విభాగానికి అందిస్తాయి. ఈ డేటా మొత్తాన్ని ఆదాయం పన్ను విభాగం ఫామ్ 26ASలో ఫిల్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, కస్టమర్లు పరిమితి మించి జరిపిన లావాదేవీల వివరాలను ఐటీ విభాగానికి అందిస్తాయి. ఐటీ రిటర్న్స్ తప్పొప్పులను గుర్తించేందుకు ఫామ్ 26AS ద్వారా సబ్మిట్ చేయాలి.
మూడు నెలలకోసారి 26AS ఫామ్‌లో డేటా అప్‌డేట్ చేయడం జరుగుతుంది.
ఈ ఫామ్ ఆదాయం పన్ను విభాగం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ ఫామ్‌లో నింపిన డేటా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్రోకింగ్ సంస్థలు వివరాలను పొందుపరచడంలో తప్పులు దొర్లొచ్చు. ఆ పొరపాట్లను గుర్తించి వెంటనే సరి చేయాలని ఆయా సంస్థల్ని పన్ను చెల్లింపుదారులు అభ్యర్థించవచ్చు. అన్ని అంశాలు చెక్ సరిగా చెక్ చేసిన తర్వాతే సకాలంలో ఐటీ రిటర్న్న్ సబ్మిట్ చేయాలి. మీరు సకాలంలో ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తే.. దానికి సంబంధించి రీ ఫండ్స్ కూడా తొందరగా పొందవచ్చు.
Read Also : IT Returns: ఐటీ రిటర్స్‌కు గడువు పొడిగించిన కేంద్రం