CJI NV Ramana : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ.. రెండో తెలుగు వ్యక్తిగా చరిత్ర

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్‌ ఎన్వీ రమణ(నూతల పాటి వెంకటరమణ) నియామకం ఖరారైంది. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు.

CJI NV Ramana : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ.. రెండో తెలుగు వ్యక్తిగా చరిత్ర

Cji Nv Ramana

వ్యవసాయ కుటుంబం.. ఒక్కో మెటు ఎదుగుతూ ఉన్నత స్థాయికి..
సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం. తొలుత అమరావతిలోని ఆర్వీఆర్ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేశారు. అనంతరం 1982లో నాగార్జున విశ్వ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 1983 ఫిబ్రవరి 10న బార్‌ అసోసియేషన్‌లో పేరు నమోదు చేసుకున్నారు.

ఒక్కో మెట్టు ఎదుగుతూ హైకోర్టు న్యాయమూర్తిగా అనంతరం.. 2000 జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 2017 ఫిబ్ర‌వ‌రి 14 నుంచి సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉన్నారు. అంత‌కు ముందు ఆరు నెల‌ల పాటు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ని చేశారు.

ఆ పదవి చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా రికార్డ్:
జస్టిస్ రమణ సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకూ సీజేఐగా పనిచేశారు.