ఇదెక్కడి చోద్యం : బేకరీలోని కరాచీని కప్పేస్తున్న వ్యాపారులు

బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్‌కు గట్టిగా బుద్దిచెప్పాలని

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 05:52 AM IST
ఇదెక్కడి చోద్యం : బేకరీలోని కరాచీని కప్పేస్తున్న వ్యాపారులు

బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్‌కు గట్టిగా బుద్దిచెప్పాలని

బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్‌కు గట్టిగా బుద్దిచెప్పాలని ప్రభుత్వాన్ని  కోరుతున్నారు. ఇప్పటికే పాక్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే పనిలో ఉంది. చివరకు నదీ జలాలను కూడా ఆపేశారు.

పాకిస్తాన్‌పై ఎంత ఆగ్రహంగా ఉన్నారు అని చెప్పడానికి కర్నాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన నిదర్శనంగా నిలిచింది. బెంగళూరులోని కరాచీ బేకరీపై పుల్వామా దాడి  ఎఫెక్ట్ పడింది. బేకరీ పేరులో కరాచీ అనే పేరు ఉండటం వివాదానికి దారితీసింది. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు బేకరీ ముందు ఆందోళనకు దిగారు. కరాచీ అని పేరు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అది పాకిస్తాన్‌కు చెందిన పదం అని, ఆ బేకరీ పాకిస్తాన్ వాళ్లదని వారు వాదించారు. వెంటనే కరాచీ అనే పదాన్ని తొలగించాలని, బేకరీని మూసేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
Read Also: గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఊహించిన ఘటనతో కంగుతిన్న బేకరీ యాజమాన్యం.. ఎందుకొచ్చిన గొడవ అని.. కరాచీ అనే పేరుపై గుడ్డ కప్పేసింది. అంతేకాదు భవనంపై జాతీయ జెండా కూడా ఎగురవేసింది. అలా ఆందోళనకారులను సంతృప్తిపరిచి అక్కడి నుంచి పంపేశారు. తాము పాకిస్తాన్ వాళ్లం కాదని బేకరీ ఓనర్లు చెప్పారు. 53 ఏళ్లుగా భారత్‌లో కరాచీ బేకరీ పేరుతో బిజినెస్ చేస్తున్నామని వివరించారు. బేకరీ ఓనర్లు కూడా హిందువులే అని చెప్పారు. కరాచీ పేరుకి పాకిస్తాన్‌కి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆందోళనకారులను సంతృప్తి పరిచేందుకు భవనంపై జాతీయ జెండా కూడా ఎగురవేశామన్నారు.    
Read Also: గ్రే లిస్ట్ లో పాకిస్తాన్: భారత్ ప్రయత్నాలు ఫలించేనా?

ఖాన్ చంద్ రమణి.. కరాచీ బేకరీని ఏర్పాటు చేశారు. 1947లో దేశ విభజన సమయంలో ఆయన భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో కరాచీ పేరుతో తొలి బేకరీని ఓపెన్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా శాఖలను విస్తరించారు. ఫ్రూట్ బిస్కెట్లకు కరాచీ బేకరీ చాలా ఫేమస్.

ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కరాచీ పేరుని పాకిస్తాన్‌తో లింక్ చేయడం పట్ల వ్యాపారులు విస్మయం చెందుతున్నారు. కరాచీ పేరుని కప్పేయాలనే వింత డిమాండ్ విని.. ఇదెక్కడి చోద్యం అని ఆశ్చర్యపోతున్నారు. అసలు కరాచీ పేరుకి పాకిస్తాన్‌కు ఎలాంటి రిలేషన్ లేదని వాస్తవాన్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు