Karnataka: హిజాబ్ ధరించే ముస్లిం స్టూడెంట్స్‌కు క్లాసుల్లోకి నో ఎంట్రీ

మంగళూరు, చిక్కమంగళూరు కాలేజీల్లో అమలైన విధానం తర్వాత ఉడుపి కాలేజీలో సైతం అదే నిర్ణయం తీసుకున్నారు. హిజాబ్ ధరించే ముస్లిం స్టూడెంట్లకు క్లాసుల్లోకి ఎంట్రీ లేదని చెప్పేశారు.

Karnataka: హిజాబ్ ధరించే ముస్లిం స్టూడెంట్స్‌కు క్లాసుల్లోకి నో ఎంట్రీ

Hizab

Karnataka: మంగళూరు, చిక్కమంగళూరు కాలేజీల్లో అమలైన విధానం తర్వాత ఉడుపి కాలేజీలో సైతం అదే నిర్ణయం తీసుకున్నారు. హిజాబ్ ధరించే ముస్లిం స్టూడెంట్లకు క్లాసుల్లోకి ఎంట్రీ లేదని చెప్పేశారు. తాము నిర్దేశించిన యూనిఫామ్స్ మాత్రమే ధరించాలని ఆదేశించారు. హిజాబ్ ధరించే విద్యార్థులకు ఇకపై క్లాసుల్లోకి ఎంట్రీలేదు.

వారం క్రితం మంగళూరు కాలేజీలో ముస్లిం స్టూడెంట్లు హిజాబ్ ధరిస్తున్నందుకు నిరసనగా రైట్ వింగ్ ఆర్గనైజేషన్లు కాషాయం స్కార్వ్స్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం సూడెంట్లను హిజాబ్ ధరించగా అనుమతించినప్పుడు కాషాయపు స్కార్వ్స్ ధరించినప్పుడు తమని కూడా అనుమతించాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా చిక్కమంగళూరులోనూ హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ రంగు స్కార్వ్స్ దర్శనమిచ్చాయి. ప్రభుత్వం నడిపిస్తున్న బలగాడి గ్రామంలోని కొప్ప తాలూకాలో ఈ ఘటన జరిగింది. కొప్పా కాలేజీలో హిజాబ్ ధరించే స్త్రీలు క్లాస్ కు అటెండ్ అవ్వొద్దంటూ స్టూడెంట్స్ లోనే డిమాండ్లు మొదలయ్యాయి.

ఇది కూడా చదవండి: జకోవిచ్ వీసా క్యాన్సిల్, మూడేళ్ల నిషేదం

ఈ సమస్యను పరిష్కరించేందుకు గానూ మంగళూరు, చిక్క మంగళూరులలో నిర్దేశించిన యూనిఫాం మాత్రమే అనుమతిస్తున్నారు. హిజాబ్, కాషాయ రంగు స్కార్వ్స్ లాంటి వాటిని నిషేదించారు.