ముందుంది కరోనా విశ్వరూపం…భారత్ లో వచ్చే 2-3నెలల్లోనే అసలు ముప్పు

  • Published By: venkaiahnaidu ,Published On : August 6, 2020 / 07:03 PM IST
ముందుంది కరోనా విశ్వరూపం…భారత్ లో వచ్చే 2-3నెలల్లోనే అసలు ముప్పు

రానున్న రోజుల్లో భారత్ పెద్ద ఉత్పాతం ఎదుర్కోబోతోందా..? ఇప్పటికే రోజుకు 50వేల వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అసలు ముప్పు అంతా రాగల రెండు మూడు నెలల్లోనే ఉందా అంటే..ఔననే అంటున్నారు సైంటిస్టులు, పరిశోధకులు..కరోనా వైరస్‌ ఇప్పుడు భారత్‌లో చూపిస్తున్న ప్రతాపమంతా కొంతే అని..రానున్న రోజుల్లో ఈ ఉధృతి భీకర స్థాయిని చేరుతుందంటున్నారు

భారత్‌కి కరోనా రూపంలో పెద్ద ఉత్పాతమే పొంచి ఉందా..కరోనా వైరస్ ఉథృతి తగ్గడం కాదు..అసలు సెకండ్ వేవ్ కూడా ప్రారంభం అవుతుందా అంటే..సైంటిస్టులు..అంతర్జాతీయ పరిశోధకులు ఔననే అంటున్నారు. అసలు భారత్‌లో ఇప్పుడు కరోనా బీభత్సం కొనసాగుతుందని..ఐతే తొందర్లోనే తగ్గే సూచనలు ఉన్నాయని కొంతమంది అంచనా వేసారు..ఢిల్లీలాంటి రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు భారీగా తగ్గిపోవడమే ఇందుకు కారణం..ఐతే అసలు కరోనా పీక్ స్టేజ్, అంటే పతాక స్థాయికి చేరలేదంటుడంగా..మళ్లీ సెకండ్ వేవ్ కూడా భారత్‌కి పొంచి ఉందనే అంచనాలు ప్రారంభమయ్యాయ్.

మన దేశంలో వైరస్ కేసులు రోజుకి యాభైవేలకి తగ్గకుండా..నమోదవుతున్నాయ్..వరసగా ఎనిమిదో రోజూ 50వేలు దాటడమే కాకుండా..బుధవారం ఏకంగా 56వేల కేసులు రికార్డయ్యాయ్. చాలావరకూ సర్వేలన్నీ..మన దేశంలో జులై నాటికే కరోనా పీక్ స్టేజ్‌కి చేరుతుందన్నారు..ఐతే అది జరగలేదు..కేసులు పెరుగుతూనే పోతున్నాయ్. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంటూ ప్రారంభమైతే..అదెలా ఉంటుందో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించడానికి భయమేస్తుంది..

ఐతే భారత్‌లో సెకండ్ వేవ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ..ప్రస్తుతం దేశంలో ఫ్లూ సీజన్ నడుస్తోంది..ఏది కరోనా జ్వరమో..జలుబో, ఏది సాధారణ ఫ్లూ జలుబో చెప్పలేం..గుర్తుపట్టడం కష్టం..అందుకే కరోనా సెకండ్ వేవ్ వస్తే..సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లోనే ఉండొచ్చని ఓ అంచనా మాత్రం ఉంది లాక్‌డౌన్ దశలవారీగా జరగడంతోనే..వైరస్ కేసులు సంఖ్య భారీగా ఉన్నా…చాలావరకూ ప్రజలకు వైరస్‌పై అవగాహన వచ్చింది..అందుకే వైరస్ మరణాల సంఖ్య తక్కువనే వాదన ఉంది..ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లోని నగరాల్లో వీకెండ్ లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు..సురక్షిత విధానాలైన సామాజిక దూరం మాస్క్ ధరించడం వంటివి కనీసం ఓ ఏడాదిపాటైనా పాటిస్తేనే పరిస్థితి అదుపులో ఉంటుందంటున్నారు..

ప్రపంచదేశాల్లో కరోనా కేసుల్లో రెండో దశ ప్రారంభమైంది. స్పెయిన్‌లో వైరస్ ఉధృతి తగ్గిందనుకున్న కొద్ది రోజుల్లోనే తిరిగి కొత్త కేసులు ప్రారంభం అయ్యాయ్. జూన్ 1 నాటికి 27127 మంది స్పెయిన్‌లో కరోనాతో మరణించగా..మొత్తం కేసుల సంఖ్య 2,39,638..ఐతే జులై 30 తర్వాత మాత్రం తిరిగి రోజుకు వెయ్యి కేసులు చొప్పున నమోదు కావడం ప్రారంభమైంది..దీంతో పాటే డెత్ టోల్ కూడా పెరిగింది..మొత్తం కేసుల సంఖ్య జులై చివరికే 352847కి చేరింది..అలానే ఫ్రాన్స్, నార్వే లాంటి దేశాల్లోనూ సెకండ్ వేవ్ ప్రారంభమైందనే..సంకేతంతో లాక్‌డౌన్ నిబంధనలను తిరిగి అమలు చేయడం ప్రారంభమైంది.

యూకేలోనూ ఇదే రకమైన పరిస్థితి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రోజూ 1700 కేసులు నమోదవుతున్న పరిస్థితి. బెల్జియంలో వైరస్ విజృంభణని అడ్డుకోవడానికి మరోసారి లాకడౌన్‌ విధించే దిశగా అడుగులు పడుతున్నాయ్. ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత భారత్ కూడా సెకండ్ వేవ్‌కి ప్రిపేరై ఉండాలని..లేదంటే పెద్ద ఉత్పాతమే చోటు చేసుకోవచ్చంటూ హెచ్చరిస్తున్నారు.