వాట‌ర్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించిన కేరళ

  • Published By: venkaiahnaidu ,Published On : October 18, 2020 / 05:13 PM IST
వాట‌ర్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించిన కేరళ

Kerala launched first water taxi service కేర‌ళ రాష్ర్ట ప్ర‌భుత్వం మొద‌టిసారిగా వాట‌ర్ టాక్సీ సర్వీసుల‌ను ప్రారంభించింది. ఆదివారం(అక్టోబర్-18,2020)అల‌ప్పుజ బ్యాక్ వాట‌ర్స్‌లో ఈ వాట‌ర్ టాక్సీల‌ను రాష్ర్ట వాటర్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. కాటమరాన్ డీజిల్ శక్తితో పనిచేసే ఈ టాక్సీలు 10 మంది ప్రయాణీకులకు కూర్చుని ప్ర‌యాణించే సామర్థ్యం క‌లిగిఉన్నాయి.



న‌వ‌గ‌తి మెరైన్ డిజైన్ అండ్ క‌న్‌స్ర్ట‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వాట‌ర్ టాక్సీల‌ను నిర్మించింది. ఎల‌క్ర్టిక్ ప‌వ‌ర్ స్టీరింగ్, సోలార్ ప్యానెల్ అమ‌రిక‌తో అన్ని విద్యుత్ అవ‌స‌రాల‌ను తీర్చేలా దీన్ని తయారుచేశారు. చిన్న ప‌రిమాణం కార‌ణంగా ఈ ట్యాక్సీల్లో ఎక్క‌డికైనా చేరుకోవ‌చ్చు. గంట‌కు 35 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తాయి.