Kerala Governor: పదో తరగతి ముస్లిం విద్యార్థినికి స్టేజిపై అవమానం: ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ గవర్నర్

ముస్లిం విద్యార్థినిని వేదికపైకి పిలిచి ముస్లిం మతపెద్ద అవమాన పరిచిన ఘటన ఇప్పుడు కేరళ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థినిని స్టేజిపై అవమాన పరచడం పట్ల కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Kerala Governor: పదో తరగతి ముస్లిం విద్యార్థినికి స్టేజిపై అవమానం: ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ గవర్నర్

Kerala

Kerala Governor: పదో తరగతి చదువుతున్న ముస్లిం విద్యార్థినిని వేదికపైకి పిలిచి ముస్లిం మతపెద్ద అవమాన పరిచిన ఘటన ఇప్పుడు కేరళ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థినిని స్టేజిపై అవమాన పరచడం పట్ల కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురంలో ఇటీవల సమస్త కేరళ జెమ్-ఇయ్యతుల్ ఉలమా, ముస్లిం పండితుల సంఘం ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నాయకుడు పనక్కడ్ సయ్యద్ అబ్బాస్ అలీ షిహాబ్ తంగల్ కూడా హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా..చదువులో ప్రతిభ కనబరిచిన పలువురు ముస్లిం విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందించారు.

Also read:Employees Resign: ఆఫీస్‌కొచ్చి పనిచేయమన్న యాజమాన్యం.. 800 మంది ఉద్యోగులు రాజీనామా..!

ఈక్రమంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని స్టేజిపైకి పిలువగా..సయ్యద్ అబ్బాస్ అలీ ఆ విద్యార్థినికి బహుమతి అందించారు. అయితే మత పెద్దల సమక్షంలో ముస్లిం విద్యార్థినిని స్టేజిపైకి ఆహ్వానించడం పట్ల జెమ్-ఇయ్యతుల్ ఉలమా నాయకుడు MT అబ్దుల్లా ముసలియార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముస్లిం బాలికను అందరి ముందు స్టేజిపైకి పిలవకూడదనే జ్ఞానం మీకు లేదా అంటూ కార్యక్రమ నిర్వాహకులపై ముసలియార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే విద్యార్థినిపై వివక్ష చూపడం పట్ల కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ స్పందించారు.

Also read:Hostel Girls flees: హాస్టల్ నుంచి పరారైన నలుగురు విద్యార్థినిలు: ఇంకా లభ్యం కానీ ఆచూకీ

ప్రతిభావంతులైన ఒక ముస్లిం యువతి తన ప్రతిభకు అర్హతగా అవార్డును అందుకుంటూ వేదికపై అవమానానికి గురికావడం చాలా బాధాకరం. ముస్లిం కుటుంబంలో జన్మించినందుకే ఆ బాలిక ఈ అవమానాన్ని ఎదుర్కోవడం బాధ కలిగించింది. “ముస్లిం మత పెద్దలు ఖురాన్ ఆదేశాలు మరియు రాజ్యాంగ నిబంధనలను పూర్తిగా ధిక్కరిస్తూ ముస్లిం మహిళలపై కఠినంగా వ్యవహరిస్తూ మరియు వారి వ్యక్తిత్వాన్ని ఎలా అణచివేస్తున్నారో అనేదానికి ఇది మరొక ఉదాహరణ.” అంటూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బుధవారం ట్వీట్ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.