Supreme Court : సహజీవనం చేస్తున్న జంట బిడ్డను అక్రమ సంతానమని కేరళ హైకోర్టు తీర్పు..వ్యతిరేకించి సంచనల తీర్పునిచ్చి సుప్రీంకోర్టు..

సహజీవనం చేస్తున్న జంట బిడ్డను అక్రమ సంతానమని కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. అనంతరం సంచలన తీర్పునిచ్చింది.

Supreme Court : సహజీవనం చేస్తున్న జంట బిడ్డను అక్రమ సంతానమని కేరళ హైకోర్టు తీర్పు..వ్యతిరేకించి సంచనల తీర్పునిచ్చి సుప్రీంకోర్టు..

Supreme Court

supreme court : ‘సహజీవనం’ అనేది భారత్ లో పెరుగుతోంది. ఈ సహజీవనం చేసిన ఫలితంగా పుట్టిన బిడ్డలు..వారికి ఆస్తి హక్కుల విషయంలో కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు తీర్పుని దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు పూర్తిగా వ్యతిరేకిస్తూ సంచలన తీర్పునిచ్చింది. సహజీవనం చేసిన జంటకు పుట్టిన బిడ్డ అక్రమ సంతానం అని కేరళ హైకోర్టు తీర్పునివ్వగా..సుప్రీంకోర్టు మాత్రం వారికి పుట్టిన బిడ్డ అక్రమ సంతానంగా భావించకూడదు అని తేల్చి చెప్పింది. అంతేకాదు ఆ బిడ్డకు వారి పూర్వీకుల ఆస్తికి కూడా హక్కుదారులు అంటూ సంచలన తీర్పునిచ్చింది.

దీర్ఘకాలంగా కొనసాగితే దానిని అక్రమ సంబంధంగా భావించకూడదని.. దానిని వివాహ బంధంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు..వారికి పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా కూడా ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సోమవారం (13,2022) కొట్టివేసింది.

Also read : High Court : సహజీవనం వల్లే లైంగిక నేరాలు పెరుగుతున్నాయి..కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన దామోదరన్, చిరుతకూట్టి జంట సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వారికి ఓ మగపిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టినా..వీరు వివాహం చేసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారికి పుట్టిన బాబును అక్రమ సంతానం అని అందుకే పూర్వీకుల ఆస్తి ఇచ్చేది లేదని సదరు కుటుంబానికి సబంధించి బంధువులు తేల్చి చెప్పారు. ఆస్తి ఇచ్చేది లేదని చెప్పారు.దీంతో సదరు జంట కేరళ హైకోర్టును ఆశ్రయించగా..కోర్టులో కూడా వారికి నిరాశే ఎదురైంది. సదరు జంటకు పుట్టిన సంతానం అక్రమ సంతానమని పేర్కొంటూ వారి పూర్వీకుల ఆస్తిలో అతడికి వాటా దక్కదని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు 2009లో తీర్పు నిచ్చింది.

దీంతో బాధిత జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా వీరి పిటిషన్‌ను జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ విచరారణ సందర్భంగా కేరళ హైకోర్టు తీర్పును వ్యతిరేకించింది. ఓ జంట దీర్ఘకాలంగా సహజీవనం చేస్తుంటే వారు వివాహం చేసుకున్నట్టుగానే పరిగణించాలని పేర్కొంది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్ప వారి బంధాన్ని భార్యాభర్తల్లానే పరిగణించాలని స్పష్టం చేసింది. 40 ఏళ్ల ఈ వివాదానికి సుప్రీంకోర్టు తీర్పునిస్తూ..వారు వివాహం చేసుకోలేదని నిరూపించాల్సిన బాధ్యత మాత్రం సవాల్ చేసిన వారిపైనే ఉంటుందని వెల్లడించింది. అలాగే, ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిక్రీ ఇచ్చిన వెంటనే తుది డిక్రీ జారీకి చర్యలు ప్రారంభించాలంటూ అన్ని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.