కేరళలో బీజేపీకి షాక్..అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పోటీకి నిరాకరించిన MBA గ్రాడ్యేయేట్

కేరళలో ఓ బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మణికుట్టన్‌ పేరు ఉంది.

కేరళలో బీజేపీకి షాక్..అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పోటీకి నిరాకరించిన MBA గ్రాడ్యేయేట్

Kerala

Kerala MBA Grad కేరళలో ఓ బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మణికుట్టన్‌ పేరు ఉంది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సీటును మణికుట్టన్‌(31)అనే MBAగ్రాడ్యేయేట్ కి బీజేపీ కేటాయించింది. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ తాజాగా కాషాయపార్టీకి మణికుట్టన్ బిగ్ షాక్ ఇచ్చారు.

బీజేపీ అభ్యర్థిగా నా పేరును టీవీలో ప్రకటించడం చూసి ఆశ్చర్యపోయాను. కొంత భయపడ్డాను. పానియా వర్గానికి చెందిన వారిని ఎన్నికల్లో నిలబెట్టడానికి బీజేపీ నన్ను ఎంచుకున్నందుకు నిజంగా సంతోషించాను. అయితే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఫోన్ ద్వారా వారికి చెప్పాను అని మణికుట్టన్‌ తెలిపారు. తాను నిజానికి సామాన్య వ్యక్తినని..రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని మణికుట్టన్ తెలిపారు. ఉద్యోగం, కుటుంబమే తనకు ముఖ్యమన్నారు. అందుకే బీజేపీ ఆఫర్‌ను సంతోషంగా నిరాకరిస్తున్నట్లు చెప్పారు.

ఇక,140అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కేరళలో ఏప్రిల్​ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే,సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ గా పేరుపొందిన శ్రీధరన్ ని ప్రకటించి మరీ ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో గతంలోలానే భంగపాటు తప్పదని తాజా సర్వేలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థిని సైతం ప్రకటించిన బీజేపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడదని తాజా టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే చెబుతోంది. గతంలో గెలిచిన ఒక్క స్థానానికే బీజేపీ పరిమితమవుతుందని సర్వే పేర్కొంది.