Mallikarjun Kharge: కాంగ్రెస్‌లో ఖర్గే మార్క్.. వర్కింగ్ కమిటీ స్థానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు.. థరూర్‌కు దక్కని చోటు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పదవి స్వీకరించిన మొదటి రోజే పార్టీలో కీలకమైన మార్పు చేశారు. సీడబ్ల్యూసీని రద్దు చేసి, స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.

Mallikarjun Kharge: కాంగ్రెస్‌లో ఖర్గే మార్క్.. వర్కింగ్ కమిటీ స్థానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు.. థరూర్‌కు దక్కని చోటు

Mallikarjun Kharge: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే మల్లికార్జున ఖర్గే తనదైన మార్కు చూపించారు. పార్టీలో అత్యున్నత కమిటీగా ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని రద్దు చేసి, కొత్తగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.

Salary Increases: వచ్చే ఏడాది వేతనాలు ఎలా ఉంటాయి? ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత? ఇండియా పరిస్థితి ఏంటి?

ఈ కమిటీలో 47 మందికి చోటు కల్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలాకు స్టీరింగ్ కమిటీలో చోటు దక్కింది. సీడబ్ల్యూసీలో ఉన్న వారిలో చాలా మందికి కొత్త కమిటీలో చోటు కల్పించారు. అయితే, ఇటీవల ఖర్గేకు ప్రత్యర్థిగా పోటీ చేసిన శశి థరూర్‌కు మాత్రం కమిటీలో చోటు దక్కలేదు. సీడబ్ల్యూసీ రద్దు కావడంతో ఈ కమిటీకి చెందిన సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు.

Ayodhya Temple: అప్పటినుంచే భక్తులకు అయోధ్య రామ మందిరం అందుబాటులోకి.. వెల్లడించిన ట్రస్టు సభ్యుడు

కొత్త కమిటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టి.సుబ్బిరామిరెడ్డికి మాత్రమే చోటు దక్కింది. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(బి) ప్రకారం కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.