కొడనాడు ఎస్టేట్ నాదే..శశికళ

  • Published By: madhu ,Published On : December 26, 2019 / 09:26 AM IST
కొడనాడు ఎస్టేట్ నాదే..శశికళ

కొడనాడు ఎస్టేట్‌కు తానే యజమానినని.. ఆదాయపు పన్ను శాఖకు జయలలిత నెచ్చెలి శశికళ చెప్పారు. శశికళ కుటుంబ సభ్యుల నివాసాలు, సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గతంలో ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే..దీనికి సంబంధించిన పలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రద్దయిన పెద్దనోట్లతో వేయి 9 వందల కోట్ల మేరకు ఆస్తులు కొనుగోలు చేసినట్టు, ఫైనాన్స్‌ చేసినట్టు తెలిసింది.

ఈ క్రమంలో ఐటీ అధికారులు ఆమెకు నోటీసు పంపారు. అక్టోబరు 22లోపు సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీన నోటీసు అందడం జరిగిందని, సమాధానం ఇవ్వడం కష్టం కావడంతో నెల రోజుల పాటు గడువు ఇవ్వాలని ఆమె తరపున ఆడిటర్ లేఖ పంపారు. కానీ 15 రోజుల సమయం మాత్రమే ఇస్తామని ఐటీ శాఖ వెల్లడించింది. 

రద్దయిన పెద్ద నోట్లతో కొనుగోలు చేసిన ఆస్తులతో తమకు సంబంధం లేదని చెప్పడంతోపాటు.. శశికళకు ఉన్న ఆస్తుల వివరాలనూ అందులో వెల్లడించినట్టు తెలుస్తోంది. 
ప్రస్తుతం శశికళ అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 

* అక్రమార్జన కేసులో నాలుగేళ్ల శిక్ష పడి 2017, ఫిబ్రవరి 14వ తేదీ నుంచి బెంగళూరులోని పరసన అగ్రహారం జైలులో శశికళ ఉంటున్నారు. 
* భర్త నటరాజన్ మృతి చెందినప్పుడు పెరోల్ పై చెన్నైకి వచ్చి టి.నగర్ లోని బంధువుల నివాసంలో గడిపి వెళ్లారు. 
 

* తర్వాత..శశికళ బంధువుల నివాసాలు, కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 
* 2017 అక్టోబర్ 15వ తేదీన ఐటీ అధికారులు ఆమెకు నోటీసు అందచేశారు. 
* కొడనాడు ఎస్టేట్ మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందినవిగా భావిస్తున్నారు. 

Read More : సూర్య గ్రహణం : తెరుచుకున్న టెంపుల్స్..సంప్రోక్షణలు