Positive Cafe: హెచ్ఐవీ బాధితులు నడిపిస్తున్న “కేఫ్ పాజిటివ్”: అక్కడికే వెళ్తున్న జనం ఎక్కడో తెలుసా?

పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతా నగరంలో హెచ్ఐవి పాజిటివ్ కు గురైన ఏడుగురు యువకులు స్వయం ఉపాధి కోసం కేఫ్ నిర్వహిస్తున్నారు. అందులో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు అందరు ఎయిడ్స్ బాధితులే

Positive Cafe: హెచ్ఐవీ బాధితులు నడిపిస్తున్న “కేఫ్ పాజిటివ్”: అక్కడికే వెళ్తున్న జనం ఎక్కడో తెలుసా?

Cafe

Positive Cafe: హెచ్ఐవి బాధితులంటే నేటికీ సమాజంలో చిన్నచూపు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో నెలకొన్న కొన్ని అపోహలు అందుకు కారణం అయితే..కొని తెచ్చుకున్న వ్యాధి అంటూ సమాజంలో నాటుకుపోయిన అంధ విశ్వాసం ఎయిడ్స్ పీడితులను మనుషుల్లో వేరుగా చూసేలా చేసింది. అయితే హెచ్ఐవీ – ఎయిడ్స్ నివారణతో పాటు వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడరాదంటూ ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు చేస్తున్న ప్రచారాలు పరిస్థితిలో కొంత మార్పు తెస్తున్నాయి. ఎయిడ్స్ బాధితులైన తమకూ అందరితో సమానంగా బ్రతికే అర్హత ఉందంటూ కొందరు యువకులు..స్వయంగా కేఫ్ నడుపుతున్నారు. యుక్త వయసులోనే ఎయిడ్స్ భారిన పడ్డ కొందరు యువకులు వివక్షకు గురయ్యారు. దీంతో తమ కాళ్ళపై తామే నిలబడేలా “కేఫ్ పాజిటివ్” పేరిట ఒక కాఫీ షాప్ నిర్వహిస్తున్నారు. పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతా నగరంలో హెచ్ఐవి పాజిటివ్ కు గురైన ఏడుగురు యువకులు స్వయం ఉపాధి కోసం కేఫ్ నిర్వహిస్తున్నారు.

Also read:Jharkhand Rope way: ప్రమాదం నుంచి తప్పించుకుని మృత్యు ఒడికి: సహాయక చర్యల్లో హెలికాప్టర్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

అందులో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు అందరు ఎయిడ్స్ బాధితులే ఉన్నారు. యుక్తవయసులో తమ తప్పిదం లేకుండా ఎయిడ్స్ భారిన పడ్డ యువకుల కోసం డాక్టర్ కల్లోల్ ఘోష్ అనే NGO నిర్వాహకుడు మొదటగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చారు. 2018లో కోల్‌కతాలోని జోధ్ పూర్ పార్క్ ఏరియాలో మొదట ఒక చిన్న గదిలో కేఫ్ పాజిటివ్ సెంటర్ ఏర్పాటు చేసిన ఘోష్..అందులో కొందరు యువకులకు పని కల్పించారు. అయితే ప్రజల నుంచి సరైన మద్దతు రాలేదు. అదే సమయంలో ఎయిడ్స్ బాధితులకు అక్కడ స్థానం లేదంటూ భవన యజమాని షాప్ లీజు రద్దు చేశాడు. దీంతో దక్షిణ కోల్‌కతాలోని బల్లిగంజ్ ప్రాంతంలో పెద్ద స్టోర్ ని అద్దెకు తీసుకున్న గోష్..ఈసారి మరింత పెద్ద రెస్టారంట్ ప్రారంభించి మరింత మంది ఎయిడ్స్ బాధితులను ఉద్యోగంలోకి తీసుకున్నాడు.

Also read:Rats In Kamareddy Hospital : బాబోయ్ ఎలుకలు.. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో భయం, భయం

చదువుకున్న వారు, ఉద్యోగస్తులు, సంపన్నులు ఉండే బల్లిగంజ్ ప్రాంతంలో కేఫ్ పాజిటివ్ కు అనూహ్య స్పందన వచ్చింది. వ్యాధి గురించి అపోహలను తొలగించడమే కాకుండా వివక్ష చూపని అన్ని వర్గాల కస్టమర్లను ఆకర్షిస్తోంది. దీంతో నగరంలోని మరో నాలుగు ప్రాంతాల్లో “కేఫ్ పాజిటివ్” రెస్టారెంట్ లను తెరిచే యోచనలో ఉన్నాడు గోష్. ఈ ఏడుగురు యువకులు కాఫీ, చేపలు వడ్డించడం, చిప్స్ వంటి ఆహారం తయారు చేయడం నుంచి శీతల పానీయాలను, శాండ్‌విచ్‌లను కస్టమర్‌లకు అందించడం వరకు ప్రతిదీ చేస్తారు. ఈతరహా కేఫ్ ఆసియాలోనే ఇది మొదటిది కావడం గమనార్హం. “HIV-పాజిటివ్ బాధితులు నిర్వహించే హోటల్ కు వచ్చేందుకు మా సాధారణ కస్టమర్‌లకు ఎటువంటి ఇబ్బంది లేదు.

Also read:Kerala Heavy Rains : కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు పడే అవకాశం..!

మేము కేఫ్ గురించిన అన్ని వివరాలను వివరిస్తూ ప్రతి కస్టమర్ కు కరపత్రాలను అందిస్తాము” అని గోష్ చెప్పుకొచ్చారు. చాలా మంది వినియోగదారులు కేఫ్ పాజిటివ్ హోటల్ కు వచ్చేందుకు తమకు ఇబ్బంది లేదని చెప్పారని, అయినప్పటికీ కొందరు తిరిగి వెళ్లిపోతారని గోష్ వివరించారు. యువకులు, కాస్త చదువుకున్న వారు మాత్రం తమ చిన్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారని డాక్టర్ గోష్ తెలిపారు. అయితే ఇతర అంటు వ్యాధులలాగా హెచ్‌ఐవీ వ్యాపించదనే విషయాన్నీ అందరు గుర్తుంచుకోవాలఅని గోష్ అన్నారు.