Leopard Strays Into Classroom : తరగతి గదిలోకి చిరుత..విద్యార్థిపై దాడి

తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠం వింటున్న విద్యార్థిపై సడన్ గా ఓ చిరుతపులి వచ్చి దాడి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో

Leopard Strays Into Classroom : తరగతి గదిలోకి చిరుత..విద్యార్థిపై దాడి

Tiger

Leopard Strays Into Classroom : తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠం వింటున్న విద్యార్థిపై సడన్ గా ఓ చిరుతపులి వచ్చి దాడి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అలీగఢ్‌ జిల్లాలోని ఛర్రా పోలీస్ స్టేషన్ ప్రాంత పరిధిలోని చౌదరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్‌లోని ఓ క్లాస్‌ రూమ్‌లోకి బుధవారం ఉదయం ఓ చిరుత చొరబడింది. సైలెంట్‌గా తరగతి గదిలోకి వచ్చిన పులిని చూసిన విద్యార్థులంతా భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిపై పులి దాడి చేసి గాయపర్చించింది. చిరుత దాడికి గురైన విద్యార్థి వీపు, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆ విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధిత విద్యార్థికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది. చిరుత దాడి గురించి పోలీసులు, అటవీశాఖ అధికారులకు స్కూల్‌ యాజమాన్యం సమాచారం ఇచ్చింది.

ఇక,చిరుతపులిని చూసిన భయంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు పెడుతున్న సమయంలో కాలేజ్ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిలాసటలో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు,తరగతి గదిలో చిరుత ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ALSO READ Extra Marital Affair : వివాహేతర సంబంధం-పులివెందులలో మహిళ దారుణ హత్య