Threat Letter: ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్లు, ఆలయాలు పేల్చివేస్తామంటూ లేఖ: 20 ఏళ్లుగా లేఖలు వస్తూనే ఉన్నాయన్న పోలీసులు

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ దేవాలయాలు, ఆత్యాద్మిక స్థలాలు సహా ఆరు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామంటూ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేగింది

Threat Letter: ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్లు, ఆలయాలు పేల్చివేస్తామంటూ లేఖ: 20 ఏళ్లుగా లేఖలు వస్తూనే ఉన్నాయన్న పోలీసులు

Uttarkhand

Threat Letter: ఉత్తరాఖండ్ లోని ప్రముఖ దేవాలయాలు, ఆత్యాద్మిక స్థలాలు సహా ఆరు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామంటూ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేగింది. రూర్కీ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఆదివారం సాయంత్రం అందిన ఇమెయిల్ లేఖలో ఈమేరకు ఉగ్రవాదులు ఈ హెచ్చరికలు చేసినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏరియా కమాండర్ సలీమ్ అన్సారీ పేరుపై ఈ లేఖ రావడం కలకలం సృస్టించింది. ఉత్తరాఖండ్ లోని లక్సర్, నజీబాబాద్, డెహ్రాడూన్, రూర్కీ, రిషికేశ్ & హరిద్వార్ రైల్వే స్టేషన్లు సహా ఇతర ఆత్యాద్మిక స్థలాలపై మే 21న దాడులు చేస్తామని లేఖలో పేర్కొన్నారు.

Also Read:Earthquake : అండమాన్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టు దిట్టం చేశారు పోలీసులు. అయితే ఉగ్రదాడి లేఖపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పందిస్తూ..మతిస్థిమితం లేని ఒక వ్యక్తి నుంచి గత 20 ఏళ్లుగా ఇటువంటి బెదిరింపు లేఖలు వస్తూనే ఉన్నాయని..అయినా నిర్లక్ష్యం ప్రదర్శించక..పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. కాగా పంజాబ్ రాష్ట్రంలోనూ మే 21న రైల్వే స్టేషన్లను పేల్చి వేస్తామంటూ ఏప్రిల్ 27న ఇదే తరహాలో లేఖ వచ్చింది. దీంతో పంజాబ్ లోనూ రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు అక్కడి పోలీసులు.

Also read:Himachal Khalistan: హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ఖలిస్థాన్ జెండాల ఘటనలో కేసులు నమోదు