జైలునుంచి పరారై 600కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి..బ్యాంకు దోచేసిన మోస్ట్ వాంటెడ్ దొంగ...

జైలునుంచి పరారై 600కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి..బ్యాంకు దోచేసిన మోస్ట్ వాంటెడ్ దొంగ…

దొంగబుద్ది ఎప్పటికీ మారదన్నట్లుగా ఉంది ఓ మోస్ట్ వాటెంట దొంగను చూస్తే. జైలు నుంచి పారిపోయిన ఓ దొంగ బైటకెళ్లి మళ్లీ అదే పనిచేశాడు. ఈసారి ఓ సైకిల్ దొంగతనం చేశాడు. అలా దొంగతనం చేసిన సై

జైలునుంచి పరారై 600కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి..బ్యాంకు దోచేసిన మోస్ట్ వాంటెడ్ దొంగ…

దొంగబుద్ది ఎప్పటికీ మారదన్నట్లుగా ఉంది ఓ మోస్ట్ వాటెంట దొంగను చూస్తే. జైలు నుంచి పారిపోయిన ఓ దొంగ బైటకెళ్లి మళ్లీ అదే పనిచేశాడు. ఈసారి ఓ సైకిల్ దొంగతనం చేశాడు. అలా దొంగతనం చేసిన సైకిల్ ని తొక్కుకుంటూ  600కిలోమీటర్లు  పారిపోయి తన సొంత ఊరుకు చేరుకున్నాడు. ఆ తరువాత అక్కడ బ్యాంక్ కు కన్నం వేసి దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే..పశ్చిమ బెంగల్‌, ఒడిశాలో పలు దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ దొంగ  ప్రీతమ్‌ ఘోష్‌(30) పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఒడిశాలో పట్టుబడి జైలుకు వెళ్లిన ప్రీతమ్‌ ఘోష్‌.. జైలు నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు వెతుతున్నారు. అలా బైటకెళ్లినవాడు మళ్లీ పోలీసులకు చచ్చినా దొరక్కూడదనుకున్నాడు.

దీంతో  బస్సులో వస్తే జిల్లా సరిహద్దుల్లో పోలీసులకు పట్టుబడిపోతాననే ప్లాన్ తో బీహార్‌లోని రాజపకర్‌ ప్రాంతంలోని బసారా గ్రామం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలోని తన సొంత ఊరు ఉత్తర్‌పారాకు.. దాదాపు 600 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చేశాడు.

అక్కడికొచ్చాక పాత నేరస్థులతో జట్టుకట్టి మరో దొంగతనానికి ప్లాన్ చేశాడు. ఉత్తర్‌పారాలోని యూనియన్‌ బ్యాంక్‌లో శుక్రవారం (జూన్ 5,2020) అర్ధరాత్రి దోపిడీకి పాల్పడి దాదాపు రూ.17 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా..బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రీతమ్‌ ఘోష్‌ పాత్ర ఉందని తెలుసుకున్నారు.  బ్యాంకు సీసీటీవీలతో పాటు ఆ ప్రాంతంలోని సీసీ టీవీలను పరిశీలించటంతో  ప్రీతమ్‌తో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారని గ్రహించి మూడు రోజుల్లో వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

అనంతంర ప్రీతమ్ ను విచారించగా..జైలు నుంచి పారిపోయిన విషయం..సైకిల్ మీద 600ల కిలోమీటర్ల ప్రయాణ ఘనకార్యం గురించి పోలీసులకు చెప్పాడు. దీంతో వారు ఆశ్చర్యపోయారు. వార్నీ నీ దొంగబుద్ది మారలేదు కదారా అనుకుంటూ..ప్రీతమ్ తోపాటు దోపిడీలో పాలు పంచుకున్నవారిని కోర్టులో హాజరుపరిచారు.

×