Husband sold Wife: ఎఫ్‌బీలో లవ్.. పెళ్లి.. ల‌క్షా 80 వేల‌కు భార్యను అమ్మేసిన మైనర్ భర్త!

నిండా ఆ కుర్రాడి వయసు 17 ఏళ్ళు. చదువు కూడా అంతంత మాత్రమే. ఇటుక భట్టీలలో కూలీగా ఉపాధి పొంతుతున్నా పేస్ బుక్ లో మాత్రం యమా యాక్టివ్. అలానే పేస్ బుక్ లో ఓ అమ్మాయితో పరిచయం..

10TV Telugu News

Husband sold Wife: నిండా ఆ కుర్రాడి వయసు 17 ఏళ్ళు. చదువు కూడా అంతంత మాత్రమే. ఇటుక భట్టీలలో కూలీగా ఉపాధి పొంతుతున్నా పేస్ బుక్ లో మాత్రం యమా యాక్టివ్. అలానే పేస్ బుక్ లో ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అక్కడ నుండి ప్రేమ.. ఆపై పెళ్లి జరిగిపోయింది. అమ్మాయి మాట కాదనలేక కుటుంబ సభ్యులే దగ్గరుండి సంప్రదాయబద్దంగా పెళ్లి చేశారు. కానీ.. కొన్నాళ్లకి ఆ యువకుడు భార్యను రూ.లక్షా 80 వేల రూపాయలకు అమ్మేశాడు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.

MK Stalin : సిటీ బస్సులో సీఎం.. అవాక్కయిన ప్రయాణికులు

ఒడిశాకు చెందిన రాజేశ్ రాణా అనే యువ‌కుడు ఫేస్‌బుక్ ద్వారా ఓ యువ‌తిని ప‌రిచ‌యం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ రాజ‌స్థాన్‌కు వెళ్లి అక్క‌డ ఇటుక‌బ‌ట్టీలో కార్మికులుగా చేరి జీవ‌నోపాధి పొందుతున్నారు. కానీ.. అక్క‌డ రాజేశ్‌కు పరిచయమైన 55 ఏళ్ల మ‌హిళకు త‌న భార్య‌ను రూ.ల‌క్షా 80 వేల‌కు అమ్మేశాడు. అలా భార్యను అమ్మగా వ‌చ్చిన డ‌బ్బుతో రాజేశ్ మంచి ఫీచ‌ర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్‌ను కూడా కొనుగోలు చేసి విలాసవంతంగా ఉండేందుకు తన ఇంట్లోకి కావాల్సిన వస్తువులను కొనుక్కున్నాడు.

Odisha Andhra Border: సరిహద్దు వివాదం.. ఏపీ అధికారులతో ఒడిశా పోలీసుల వాగ్వాదం!

ఆ త‌ర్వాత తీరిగ్గా భార్య తండ్రికి ఫోన్ చేసి మీ కూతురు మ‌రొక‌రితో వెళ్లిపోయింద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ రాజేశ్ మాట‌ల‌ను నమ్మని భార్య తల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా రాజేష్ భార్యను అమ్మేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు యువతిని కొన్న మ‌హిళ చెర నుంచి రాజేష్ భార్యను విడిపించారు. ఆ యువతి ఇకపై రాజేష్ దగ్గర ఉండనని త‌న త‌ల్లిదండ్రులతో ఉంటానని చెప్పడంతో ఆమెను తల్లిదండ్రులతో పంపిన పోలీసులు విచార‌ణ అనంత‌రం రాజేశ్‌ను జువైన‌ల్ కోర్టుకు త‌ర‌లించారు.