Ludhiana Police: వివాదాలతో స్టేషన్‌కొచ్చిన జంటలు.. టికెట్లుకొనిచ్చి సినిమాకు పంపించిన పోలీసులు

లూథియానా పోలీస్ స్టేషన్‌కు వివాదాలతో వచ్చిన దంపతులకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిలో ఇరవైమంది దంపతులు మనసు మార్చుకొని కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వారికి ఉచితంగా టికెట్లు ఇచ్చి సినిమాకు పంపించారు.

Ludhiana Police: వివాదాలతో స్టేషన్‌కొచ్చిన జంటలు.. టికెట్లుకొనిచ్చి సినిమాకు పంపించిన పోలీసులు

Punjab Police

Ludhiana Police: భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలురావటం, విడాకుల వరకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. చాలా మంది దంపతులు ఘర్షణలతో పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తుంటారు. సాధ్యమైనంత వరకు పోలీసులు వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి వారి మధ్య సయోధ్య కుదుర్చుతుంటారు. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా పోలీసులు వాలెంటైన్స్ డే సందర్భంగా వినూత్నంగా ఆలోచించారు. అనేక మంది దంపతులు ఘర్షణ కారణంగా తమకు విడాకులు ఇప్పించాలని పోలీస్ స్టేషన్ల బాటపట్టారు. అయితే వారిని వాలంటైన్స్ డే రోజు లూథియానా పోలీసులు స్టేషన్ కు పిలిపించారు.

VIral News: బావిలో పడ్డా.. ప్రియురాలు దక్కింది..! అదృష్టమంటే వీడిదేకాబోలు..

పోలీస్ స్టేషన్ కు వచ్చిన దంపతులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరిలో 20మంది దంపతులు మనసు మార్చుకొని కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. వాలెంటైన్స్ డే కావడంతో వారికి ఉచితంగా సినిమా టికెట్లు ఇచ్చి సినిమాకు పంపించారు. ఈ విషయంపై అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు రూపిందర్ కౌర్ భట్టి మాట్లాడుతూ.. పోలీస్ విత్ హార్ట్ కార్యక్రమం కింద చిన్నచిన్న వివాదాలతో విడిపోవాలని భావించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు.

 

అయితే, వాలంటైన్స్ డే కావడంతో వివాదాలతో పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్న వారిని పిలిపించి, వారిలో ఒక్కో జంటకు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని, వారిలో 20 జంటలు ఒక్కటి కావటంతో వారిని ఉచితంగా టికెట్లు ఇచ్చి సినిమాకు పంపించటం జరిగిందని పోలీసులు తెలిపారు. లూథియానా పోలీసుల ఆలోచనను స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.