మధురై ఎంపీకి కేంద్రం లేఖ…హిందీలో ఉందని తిప్పి పంపిన ఎంపీ

మధురై ఎంపీకి కేంద్రం లేఖ…హిందీలో ఉందని తిప్పి పంపిన ఎంపీ

Madurai MP గాంధీ శాంతి బహుమతికి సంబంధించి రికమండేషన్లు కోరుతూ మధురై ఎంపీ వెంకటేషన్ కి కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ లేఖను పంపగా..ఆ లేఖను ఎంపీ తిరిగి కేంద్ర మంత్విత్వశాఖకు పంపారు. దీనికి కారణం ఆ లేఖలో అక్షరాలు హిందీలో ఉండటమే.

ఫిబ్రవరి-27న కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ తనకు లేఖ రాశారని,అయితే ఆ లేఖ హిందీలో ఉండటం వల్ల అందులోని విషయం తనకు అర్థం చేసుకోలేకపోయానని ఎంపీ వెంకటేషన్ తెలిపారు. అయితే లేఖకి అటాచ్ చేసిన ఫార్మ్ ఇంగ్లీష్ లో ఉండటం వల్లే..గాంధీ శాంతి బహుమతి కోసం రికమండేషన్లు పంపండి అని తనను కోరినట్లు అర్థమయ్యిందని వెంకటేషన్ తెలిపారు. తాను ఆ లేఖను తిరిగి సంబంధిత మంత్రిత్వశాఖకు పంపిస్తున్నానని,భవిష్యత్తులో అయినా ఇలాంటి రెచ్చగొట్టుడు పనులు చేయకూడదని సదరు మంత్రి తనశాఖ అధికారులకు సూచించాలని తాను కోరుతున్నానన్నారు.

కాగా,తాను గతంలో కూడా.. వివిధ మంత్రిత్వశాఖల నుంచి సమాచారాన్ని హిందీలో పంపడంపై పలుసార్లు నిరసన వ్యక్తం చేసినట్లు వెంకటేషన్ తెలిపారు. ఇది అధికారిక భాష అమల చట్టానికి(Official Language Implementation Act)వ్యతిరేకమని ఆయన తెలిపారు. వెంకటేషన్ ఇదే విషయమై మద్రాస్ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. కోర్టులో కేంద్రం పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కమ్యూనిఖేషన్స్ ఇంగ్లీష్ లో ఉండేలా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

విభిన్న సంస్కృతులు,విభిన్న భాషలను ఈ గొప్ప దేశం కలిగి ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న సెన్సివిటినీ కనీసం మంత్రిత్వశాఖలోని అధికారులు కలిగి ఉండాలని ఎంపీ అన్నారు. కేంద్రప్రభుత్వం సంస్కృతం,హిందీ భాషలను…హిందీయేతర రాష్ట్రాలు మరీ ముఖ్యంగా తమిళనాడులో అమలుచేయాలన్న ప్రాజెక్ట్ లో భాగంగా భారత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటివి చేస్తోందా అని ఎంపీ వెంకటేషన్ అనుమానం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన ప్రతీసారి గట్టిగా పోరాడిన,ప్రాణాలు అర్పించిన అధ్భుతమైన చరిత్ర తమిళనాడుకి ఉందని ఎంపీ అన్నారు. తమ ఐడెంటిటీ,గొప్ప సాంప్రదాయాలను కాపాడుకునేందుకు తమిళ ప్రజలు వెనకడుగు వేయరని అన్నారు.