Pregnant tiger Killed: గర్భంతో ఉన్న పులిని సజీవ దహనం చేసిన కిరాతకులు..పుట్టకుండానే తల్లి కడుపులో మాంసం ముద్దలైపోయిన కూనలు

గర్భంతో ఉన్న పులిని సజీవ దహనం చేశారు వేటగాళ్ళు. మంటల్లో కాలిపోయిన ఆ పులి గర్భంలో నాలుగు పిల్ల‌లు ఉన్నాయి. పాపం ఆ పులి కూనలు తల్లి కడుపులోని కాలి మాంసం ముద్దలుగా మారిపోయాయి. వేగిన్ అనే ఈ పులిని అత్యంత కిరాతకంగా దాన్ని హింసించి సజీవ దహనం చేసి అది చనిపోయాక దాని ముందు పంజాలను వేటగాళ్ళు కత్తిరించుకుపోయారు.

Pregnant tiger Killed: గర్భంతో ఉన్న పులిని సజీవ దహనం చేసిన కిరాతకులు..పుట్టకుండానే తల్లి కడుపులో మాంసం ముద్దలైపోయిన కూనలు

Pregnant Tigress Poached

pregnant tiger Killed : క్రూర మృగాలు కూడా వాటికి ఆకలేస్తేనే ఇతర జంతువులను వేటాడి తింటాయి. కానీ మనిషి మాత్రం దనదాహంతో దారుణాలకు పాల్పడుతున్నాడు. మనిషా? నరరూప రాక్షసుడా? అనే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో క్రూరర మృగాన్ని అంత్యం క్రూరత్వంతో చంపేశాడు కిరాతకులు. గర్భంతో ఉన్న పులిని సజీవంగా దహనం చేశారు. ఆ తరువాత ఆ పులికి ఉన్న పంజాలను (గోళ్ల)ను కత్తిరించుకుని పట్టుకుపోయిన క్రూరమైన ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని పంధర్కావాడ తాలూకాలోని జారీ-జామ్నీ గ్రామాల సమీపంలో చోటుచేసుకుంది.

గత సోమవారం (ఏప్రిల్ 26,2021)న గర్భంతో ఉన్న వేగిన్ అనే ఈ పులిని కల్వర్టు లోపల లాక్ చేసి సజీవ దహనం చేశారు వేటగాళ్ళు. మంటల్లో కాలిపోయిన ఆ పులి గర్భంలో నాలుగు పిల్ల‌లు ఉన్న‌ాయి. పాపం ఆ పులి కూనలు తల్లి కడుపులోని కాలి మాంసం ముద్దలుగా మారిపోయాయి. వేగిన్ అనే ఈ పులిని అత్యంత కిరాతకంగా దాన్ని హింసించి సజీవ దహనం చేసి అది చనిపోయాక దాని ముందు పంజాలను వేటగాళ్ళు కత్తిరించుకుపోయారు.

నాలుగు సంవత్సరాల వయస్సున్న పులి సోమవారం ఉదయం క‌ల్వ‌ర్టులో చ‌నిపోయి ఉండ‌టాన్ని ఆ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి గ‌మ‌నించాడు. వెంటనే అటవీశాఖ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వేటగాళ్లు ఈ పులిని పట్టుకోవటానికి ఇనుప చువ్వ‌ల‌ను అమ‌ర్చ‌ి..దాన్ని ట్రాప్ చేశారు. అనంతరం దాన్ని క‌ల్వ‌ర్టులోంచి పులి పారిపోకుండా ఏర్పాటు చేసి..ఆ తరువాత పులికి నిప్పంటించి స‌జీవ ద‌హ‌నం చేశారు. అది చ‌నిపోయిందా లేదా అని తెలుసుకునేందుకు ప‌దునైన ఆయుధాల‌తో దూరంగా నిలబడి పొడిచి..పొడిచి చూసి అది పూర్తిగా ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించుకున్నాక దాన్ని గోళ్లను కత్తిరించి పట్టుకుపోయినట్లుగా అక్కడ పరిస్థితిని పరిశీస్తే తేలింది.

తాపేశ్వ‌ర్ వన్యప్రాణుల అభయారణ్యం (టీడబ్ల్యుఎస్)లో ఈ హత్య ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు 30 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌దేశం ఉండ‌టంతో స్థానిక అట‌వీవాసుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. టీడ‌బ్ల్యూఎస్‌కు చెందిన‌ పెద్ద పులులు ఎక్కువ‌గా క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌కు వ‌ల‌స వ‌స్తుంటాయి. ఈ ఘ‌ట‌న‌పై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ పులుల ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా అట‌వీ అధికారుల‌ను కోరుతున్నారు.