Aurangzeb Tomb:లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ఔరంగజేబు సమాధి 5రోజుల మూసివేత

మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని 5రోజుల పాటు మూసి ఉంచనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ పూర్తిగా ముగియకముందే తెరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Aurangzeb Tomb:లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ఔరంగజేబు సమాధి 5రోజుల మూసివేత

Devendra Fadnavis

 

 

Aurangzeb Tomb: మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని 5రోజుల పాటు మూసి ఉంచనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ పూర్తిగా ముగియకముందే తెరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ రీసెంట్ గా ఔరంగజేబు సమాధిని సందర్శించడంతో ఈ ప్రస్తావన తెరమీదకొచ్చింది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైనా దేవేంద్ర ఫడ్నవిస్, ఒవైసీని టార్గెట్ చేస్తూ.. ఉద్దవ్ ఠాకరే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండ్రోజుల క్రితం అధికార ప్రతినిధి గజానన్ కాలే సమాధి ఉనికిని ప్రశ్నిస్తూ, కూల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అతని బెదిరింపును అనుసరించి, స్థానిక మసీదు కమిటీ ఆ ప్రాంతాన్ని తాళం వేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సంప్రదించింది. MNS నుండి ముప్పు రావడంతో స్మారక చిహ్నం చుట్టూ భద్రతను కూడా పెంచారు.

గతవారం, ఫడ్నవీస్ ఔరంగజేబును కీర్తించేందుకు ప్రయత్నించారని, తద్వారా ఈ దేశంలోని జాతీయవాద ముస్లింలను అవమానించారని ఒవైసీపై మండిపడ్డారు. ఈ దేశంలోని ముస్లింలకు ఔరంగజేబు ఎప్పుడూ ఆరాధ్యదైవం కాలేడని అన్నారు. శంభాజీరాజేను చంపే ముందు చిత్రహింసలు పెట్టాడు’’ అని ఫడ్నవీస్‌ వెల్లడించారు.

ఔరంగజేబును ఏ రకంగా కీర్తించినా ప్రజలు సహించరని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన కూడా ఒవైసీ సమాధిని సందర్శించడాన్ని విమర్శించింది. మహారాష్ట్ర వాతావరణాన్ని చెడగొట్టడమే లక్ష్యంగా ఒవైసీ సోదరులు రాజకీయాలు చేస్తున్నారని శివసేన ప్రధాన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వివరించారు. ఔరంగజేబును ఈ మట్టిలోనే పాతిపెట్టాం.. రాజకీయాలు చేయాలనుకునే ఆయన (ఔరంగజేబు) అనుచరులకు మహారాష్ట్రలో కూడా అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు.