Maharashtra E-Pass : మహారాష్ట్రలో ఈ-పాస్ తప్పనిసరి.. అప్లయ్ చేయండిలా..!

మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా ప్రయాణాలతో సహా కొన్ని సడలింపులతో జూన్ 15వరకు ఆంక్షలను పొడిగించింది. రాష్ట్రంలో పేర్కొన్న వ్యవధిలో ప్రయాణించాల్సిన వారికి ఇప్పుడు ఈ-పాస్ అవసరం తప్పనిసరి.

Maharashtra E-Pass : మహారాష్ట్రలో ఈ-పాస్ తప్పనిసరి.. అప్లయ్ చేయండిలా..!

Maharashtra E Pass Mandatory For Inter District Travel

Maharashtra E-pass mandatory : మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా ప్రయాణాలతో సహా కొన్ని సడలింపులతో జూన్ 15వరకు ఆంక్షలను పొడిగించింది. రాష్ట్రంలో పేర్కొన్న వ్యవధిలో ప్రయాణించాల్సిన వారికి ఇప్పుడు ఈ-పాస్ అవసరం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలోని జిల్లాల బయట ప్రయాణించాలనుకునే వారు ఈ-పాస్ తప్పక పొందాలి.

ప్రస్తుతం, మహారాష్ట్ర ప్రజలు పరిమిత అత్యవసర కారణాల వల్ల మాత్రమే జిల్లాల వెలుపల ప్రయాణించవచ్చు. ఇందులో తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి, మరణం, వివాహం వంటివి మొదలైనవి ఉన్నాయి.

మహారాష్ట్రలో ఈ-పాస్ కోసం దరఖాస్తు ఎలానంటే? :
– అధికారిక ఈ-పాస్ పోర్టల్‌కు వెళ్లండి
– Tabపై క్లిక్ చేయండి.. పాస్ కోసం అప్లయ్ చేయండి.
– తర్వాతి పేజీలో, మీరు ప్రయాణించాల్సిన జిల్లాను ఎంచుకోండి.
– అవసరమైన పత్రాలను సమర్పించండి.
– అత్యవసర ప్రయాణానికి కారణాన్ని వివరించండి.
– అప్‌లోడ్ చేసేటప్పుడు అన్ని సంబంధిత పత్రాలను ఒకే ఫైల్‌లో కలిపి అప్ లోడ్ చేయండి.
– దరఖాస్తును సమర్పించిన తరువాత, మీకు టోకెన్ ఐడి వస్తుంది. సేవ్ చేయండి.. మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
– సంబంధిత విభాగాల ధృవీకరణ, ఆమోదం తరువాత, మీరు టోకెన్ ఐడిని ఉపయోగించి ఈ-పాస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
– ఈ-పాస్‌లో మీ వివరాలు, వాహనం నెంబర్, ప్రామాణికత క్యూఆర్ కోడ్ ఉంటాయి.
– ప్రయాణిస్తున్నప్పుడు మీ దగ్గర సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీని ఉంచుకోండి. అడిగినప్పుడు పోలీసులకు చూపించండి.

– గుర్తింపు కార్డులు చూపించాలి :
– మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్
– వివాహ కార్డులు లేదా వివాహానికి సంబంధించిన పత్రాలు
– మరణం విషయంలో మెడికల్ ఎమర్జెన్సీ లేదా డెత్ సర్టిఫికేట్ కోసం ప్రయాణించే వ్యక్తుల మెడికల్ రిపోర్ట్
– ఇతర అత్యవసర ప్రయణాలకు డాక్యుమెంట్ అవసరం

మహారాష్ట్రలో కొత్తగా 14,123 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 477 కొత్తగా కరోనా మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 14,123 కోవిడ్ -19 కేసులతో పాటు, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 57,61,015 కు పెరిగింది. ఇక కరోనా మరణాల సంఖ్య 96,198కు పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పుడు 2,30,681 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉన్నాయి.