Face Mask: ఇకపై మాస్కులు తప్పనిసరి కాదు.. పండుగకు ముందు గుడ్ న్యూస్

గుడి పడ్వా పండుగ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారి ఆరంభమైనప్పటి నుంచి ఫేస్ మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం..

Face Mask: ఇకపై మాస్కులు తప్పనిసరి కాదు.. పండుగకు ముందు గుడ్ న్యూస్

Face Mask

Face Mask: గుడి పడ్వా పండుగ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారి ఆరంభమైనప్పటి నుంచి ఫేస్ మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేస్తూ.. చేసింది. మరాఠీ నూతన సంవత్సరమైన గుడిపడ్వా సందర్భంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. కొవిడ్ నియంత్రణలు తొలగించినప్పటికీ.. వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మాస్కులు వాడకమనేది ప్రజల వ్యక్తిగత అభిప్రాయమని, తప్పనిసరి కాదంటూ స్పష్టం చేసింది. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

Read Also: ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. గిన్నీస్ బుక్‌లో చోటు

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా తీవ్రత తగ్గినట్లు కేసుల సంఖ్య వెల్లడిస్తుందని.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తిగా అదుపులోకి వస్తుందనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి 31 నుంచి కోవిడ్‌-19 నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రాష్ట్రాలలో కేసులు పెరిగితే నిబంధనలు విధించుకునే స్వతంత్ర్యం స్థానిక ప్రభుత్వాలకే అప్పజెప్పింది కేంద్ర హోం శాఖ.