Maharashtra political crisis : షిండేను వెనుక ఉన్నది బీజేపీయేనా? శివసేన పార్టీ అస్థిత్వానికే ప్రమాదం వచ్చిందా ? | Maharashtra political crisis

Maharashtra political crisis : షిండేను వెనుక ఉన్నది బీజేపీయేనా? శివసేన పార్టీ అస్థిత్వానికే ప్రమాదం వచ్చిందా ?

మహారాష్ట్ర రాజకీయాలు మహారక్తి కట్టిస్తున్నాయ్. షిండే తిరుగుబాటుతో శివసేనకు కోలుకోలేని దెబ్బ పడింది. గతంలో చాలా విభేదాలు చూసినా.. చాలా తిరుగుబాట్లు హ్యాండిల్ చేసినా.. షిండే వ్యవహారం మాత్రం ఇప్పుడు పార్టీ అస్థిత్వానికే ప్రమాదం తెచ్చేలా కనిపిస్తోంది. షిండే తిరుగుబాటు వెనక ఉన్నది కమలం పార్టీనే అన్న అనుమానాలు ఎందుకు వినిపిస్తున్నాయ్..

Maharashtra political crisis : షిండేను వెనుక ఉన్నది బీజేపీయేనా? శివసేన పార్టీ అస్థిత్వానికే ప్రమాదం వచ్చిందా ?

Maharashtra political crisis : మహారాష్ట్ర రాజకీయాలు మహారక్తి కట్టిస్తున్నాయ్. షిండే తిరుగుబాటుతో శివసేనకు కోలుకోలేని దెబ్బ పడింది. గతంలో చాలా విభేదాలు చూసినా.. చాలా తిరుగుబాట్లు హ్యాండిల్ చేసినా.. షిండే వ్యవహారం మాత్రం ఇప్పుడు పార్టీ అస్థిత్వానికే ప్రమాదం తెచ్చేలా కనిపిస్తోంది. షిండే తిరుగుబాటు వెనక ఉన్నది కమలం పార్టీనే అన్న అనుమానాలు ఎందుకు వినిపిస్తున్నాయ్.. ఈ సంక్షోభం నుంచి బయటపడడం శివసేనకు సాధ్యమేనా ?

దేశ రాజకీయాల గురించి చర్చ మొదలైతే.. మొదట వినిపించేది యూపీ పేరు అయితే.. ఆ తర్వాత చర్చించేది మహారాష్ట్ర గురించే ! పైకి అంతా బానే కనిపించినా.. తెరవెనక రాజకీయంలో పావులు కదులుతూనే ఉంటాయ్. అందుకే ప్రతీ సీన్‌క్లైమాక్స్‌లా కనిపిస్తుంటుంది ఆ రెండు రాష్ట్రాల్లో రాజకీయం ! షిండే ఎపిసోడ్ తర్వాత మహారాష్ట్ర రాజకీయం మహా టెన్షన్‌ పెడుతోంది. తన వెనక 35మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. శివసేనకు మద్దతు ఇవ్వాలంటే.. బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. షిండే ఎన్ని డిమాండ్లు చేసినా.. తగ్గేదేలే అని ఠాక్రే అంటున్నారు. సీఎంగిరికి రాంరాం చెప్పేందుకు కూడా సిద్ధమయ్యారు.. సీఎం అధికారిక భవనం నుంచి మకాం మార్చేశారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం దాదాపు కూలిపోయినట్లే.. క్లియర్‌గా అర్థం అవుతోంది కూడా ! ఐతే ఈ పరిణామాలు శివసేన పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారాయ్. పార్టీ అస్థిత్వమే ప్రశ్నార్థకం అయ్యేలా చేస్తున్నాయ్.

Also read: Maharashtra: అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం: ఏక్‌నాథ్‌ షిండే

బ్యాచ్‌ను వేసుకొని వస్తూ వస్తూ.. షిండే చేసిన ఆరోపణలు మరింత ఆసక్తి రేపుతున్నాయ్. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో శివసేన జతకట్టిందంటూ ఏక్‌నాథ్‌ షిండే చేస్తున్న విమర్శలు.. రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయ్. ఐతే ఇదే ఇప్పుడు పార్టీకి కోలుకోలేని దెబ్బ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. నిజానికి శివసేనలో తిరుగుబాట్లు, విభేధాలు కొత్త కాదు. రాజ్‌ ఠాక్రే, శివనారాయణ రాణె, ఛగన్‌ భుజ్‌బల్‌.. ఇలా చాలామంది పార్టీ మీద అసంతృప్తితో దూరం అయ్యారు. ఐతే షిండే మాత్రం.. పార్టీ సిద్ధాంతాలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాము తిరుగుబాటు చేస్తోంది అధికారం కోసం కాదని.. హిందుత్వం కోసం అంటూ.. శివసేనను సైద్ధాంతికంగా టార్గెట్ చేస్తున్నారు., శివసేన అంటే పక్కా హిందూత్వ పార్టీ. అలాంటిది ఇప్పుడు షిండే వ్యాఖ్యలతో పార్టీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా శివసేన.. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. మరాఠీల హక్కుల పరిరక్షణ ఎజెండాగా.. పార్టీ మొదలైంది. ఐతే మరాఠీల హక్కుల పరిరక్షణ, మరాఠీ అస్తిత్వ వాదాలకు హిందుత్వ ఎజెండా జోడించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌ ఠాక్రే… శివసేనను పటిష్ట పునాదుల మీద నిలబెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ పక్కా హిందూ పార్టీగా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత సుధీర్ఘకాలం పాటు బీజేపీకి సహజ మిత్రపక్షంగా కంటిన్యూ అయింది. ఐతే 2019 ఎన్నికల్లో ముఖ్యమత్రి పీఠం కోసం పట్టుపట్టిన శివసేన.. కమలం పార్టీతో కటీఫ్ చెప్పింది. అధికారం కోసం బద్ధ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్‌ సీఎం అయ్యారు. దీంతో బీజేపీ, శివసేన మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

Also read: Maharashtra: ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేలూ వ‌చ్చి అసోంలో ఉండొచ్చు: సీఎం హిమంత

మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది.. అఘాడీ సర్కార్ ఉంటుందా కూలుతుందా అన్న సంగతి ఎలా ఉన్నా.. షిండే తిరుగుబాటు వ్యవహారం.. ఇప్పుడు అనుమానాలకు కారణం అవుతోంది. నిజానికి ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్‌కు వెళ్లడానికి రెండు రోజుల ముందు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్ధవ్‌తో కలిసి కనిపించారు. అకస్మాత్తుగా ఏం జరిగిందో.. ఏ పావు ఎటు నుంచి కదిలిందో కానీ.. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దాదాపు రెండున్నరేళ్లుగా మహావికాస్ అఘాడీ సర్కార్‌లో మంత్రి కొనసాగుతున్న ఏక్‌నాథ్ షిండేకు, ఆయన అనుచరులకు.. ఇంత హఠాత్తుగా హిందుత్వం ప్రమాదంలో పడిందని ఎందుకు గుర్తుకువచ్చింది అన్నది ఆసక్తికరంగా మారింది. అఘాడీ కూటమి అసహజం అని ఇంత ఆలస్యంగా షిండేకు తెలియడం ఏంటి అన్న చర్చ మొదలైంది.

ఇక ఏక్‌నాథ్‌ షిండే.. తన బ్యాచ్ ఎమ్మెల్యేలను తీసుకొని గుజరాత్‌కు, ఆ తర్వాత అస్సోంకు వెళ్లారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. ఈ రచ్చ అంతా జరుగుతున్న సమయంలో.. ఫడ్నవీస్‌ ఢిల్లీలో కీలక మంతనాలు మొదలుపెట్టారు. ఈ ఎపిసోడ్ అంతా పరిశీలిస్తే.. షిండే తిరుగుబాటు వెనక కమలం పార్టీ హస్తం ఉందా.. వాళ్లే నడిపిస్తున్నారా అన్న అనుమానాలు మహా రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్నాయ్. 2019 ఎన్నికల తర్వాత రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్‌.. 48గంటల్లోనే రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. తాను సముద్రాన్ని అని.. మరింత బలంగా తిరిగివస్తానంటూ.. రాజీనామా తర్వాత ఫడ్నవీస్‌ చేసిన వ్యాఖ్యలు.. మహా పరిణామాలతో మళ్లీ రీసౌండ్‌లో వినిపిస్తున్నాయ్.

Also read: Maharashtra: 12 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని శివ‌సేన పిటిష‌న్

శివసేనలో చాలా వివాదాలు ఎదురైనా.. తిరుగుబాట్లు కనిపించినా.. ప్రస్తుత పరిణామాలు మాత్రం కాస్త డిఫరెంట్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. శివసేన, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న రోజుల్లోనూ, రెండు పార్టీల మధ్య లుకలుకలు కనిపించినా.. అందుకు సిద్ధాంత విబేధాలు ఎప్పుడూ కారణం కాలేదని గుర్తు చేస్తున్నారు. మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పార్టీల మధ్య సిద్ధాంత విభేదాలు క్షేత్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయ్. ఈ పరిస్థితిలో ప్రస్తుత సంక్షోభం నుంచి శివసేన బయటపడడం అనుమానమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. గత తిరుగుబాట్లకు ప్రస్తుత తిరుగుబాటుకు మధ్య మరో తేడా ఉంది. ఈసారి అధికారంలో ఉండగా.. నాయకత్వంపై శివసైనికులు తిరుగుబాటు చేయడం… పార్టీ చరిత్రలో భారీ ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు.

×