Maharashtra: డాక్టర్ మార్నింగ్ వాక్‌కు వెళ్లడంతో పేషెంట్ మృతి.. వైద్యురాలిపై చర్యలు

డెలివరీ పేషెంట్‌ను వదిలేసి డాక్టర్ మార్నింగ్ వాక్‌కు వెళ్లడంతో రక్తస్రావం జరిగి పేషెంట్ మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Maharashtra: డాక్టర్ మార్నింగ్ వాక్‌కు వెళ్లడంతో పేషెంట్ మృతి.. వైద్యురాలిపై చర్యలు

Maharashtra: రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందో డాక్టర్. పేషెంట్‌ను వదిలేసి మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. దీంతో పేషెంట్ మృతి చెందింది. ఈ ఘటనకు కారణమైన డాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Krithi Shetty : బాలీవుడ్ సినిమాలు చేయను.. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసే ఆలోచన లేదు

గత ఏప్రిల్ 13న మహారాష్ట్రలోని జల్నా పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నేహా లిధోరియా అనే గర్భిణి చేరింది. అదే రోజు ఉదయం ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. తర్వాత, తీవ్ర రక్తస్రావానికి గురైంది. అయితే ఆమె రక్తస్రావం విషయంలో డాక్టర్, నర్సింగ్ స్టాఫ్ నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఆమెకు రక్తం అవసరమనే విషయంపై దృష్టిపెట్టలేదు. పైగా పేషెంట్‌ను అలాగే వదిలేసి, అనుభవం లేని నర్సింగ్ స్టాఫ్‌ను ఉంచి మహిళా డాక్టర్ మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి పేషెంట్ ప్రాణాలు కోల్పోయింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే తన భార్య మరణానికి కారణమని, ఆమె భర్త జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు ఒక కమిటీ ఏర్పాటు చేశారు.

Independence India Diamond Festival: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. వేడుకలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఈ అంశంపై విచారణ జరిపిన ఆ కమిటీ ఒక నివేదిక సమర్పించింది. మహిళా డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పేషెంట్ ప్రాణాలు కోల్పోయినట్లు కమిటీ అధికారులు తేల్చారు. నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.