Corona 4th wave: కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన చిన్నారుల్లో సహసంబంధ వ్యాధులు

గతంలో కరోనా భారిన పడ్డ చిన్నారుల్లో ఈ తరహా లక్షణాలు బయటపడలేదని..ప్రస్తుతం సహసంబంధ వ్యాధులకు గురవడం..కరోనా కొత్త వేరియంట్ కారణమై ఉంటుందా అనే సందేహం తలెత్తుతుంది

Corona 4th wave: కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన చిన్నారుల్లో సహసంబంధ వ్యాధులు

Corona

Corona 4th wave: దేశంలో మరోమారు కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కోవిడ్ -19 నాలుగో దశ ప్రారంభమైందన్న సంకేతాలు స్పష్టమైన తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయింది. మిగతా రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రత, ఆసుపత్రిలో చేరేంత ప్రమాదకర స్థాయిలో పరిస్థితులు లేకపోవడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలాఉంటే..దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో(NCR)..ఇటీవల పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా భారిన పడ్డారు. వారిలో కొందరు విద్యార్థులు ఆసుపత్రిలో చేరగా..వైద్యులు వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా కరోనా భారిన పడ్డ ఆ చిన్నారులు..”సహసంబంధ వ్యాధుల(comorbidities)”కు గురౌతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. తీవ్ర ఆందోళన, డిప్రెషన్, మధుమేహం వంటి వ్యాధుల భారిన పడడం ఈ సహసంబంధ వ్యాధుల లక్షణాలు.

Also read:PM Modi: ప్రపంచమే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’గా ఎలా మారాలని ఆలోచిస్తోంది: ప్రధాని మోదీ

గతంలో కరోనా భారిన పడ్డ చిన్నారుల్లో ఈ తరహా లక్షణాలు బయటపడలేదని..ప్రస్తుతం సహసంబంధ వ్యాధులకు గురవడం..కరోనా కొత్త వేరియంట్ కారణమై ఉంటుందా అనే సందేహం తలెత్తుతుంది. ఇదిలాఉంటే..కరోనా నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలోని పాఠశాలలకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థి లేదా సిబ్బందికి COVID-19 పాజిటివ్ గా నిర్ధారణ అయితే, మొత్తం ప్రాంగణాన్ని లేదా నిర్దిష్ట తరగతులను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సామాజిక దూరం పాటించాలని, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించడం మొదలైన వాటితో సహా COVID-19 ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని ఢిల్లీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Also read:China covid : షాంఘైలో పెరుగుతున్న కరోనా టెన్షన్‌..‘జీరో పాలసీ’ పేరుతో జనాలకు నరకం చూపిస్తున్న చైనా ప్రభుత్వం..