Tamil Nadu : పది రూపాయల కాయిన్స్ తో రూ.6 లక్షల కారు కొన్న తమిళ తంబి
ఇటీవలి కాలంలో కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్నాయి. దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు.

Tamil Nadu : ఇటీవలి కాలంలో కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్నాయి. దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు. మొత్తంగా ప్రజలకు వీటి వల్ల గొప్ప చికాకు వచ్చి పడింది.
దీంతో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి 10 రూపాయల నాణేలు ఇచ్చి కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా 10 రూపాయల కాయిన్స్ కలెక్ట్ చేయటం మొదలెట్టాడు. నెలరోజుల్లో మొత్తం ఆరు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి కారుకొని వార్తల్లో నిలిచాడు.
తమిళనాడులోని ఆరూర్ కు చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి తల్లి దుకాణం నడుపుకుంటూ ఉంటుంది. అక్కడకు వచ్చే కస్టమర్లు 10 రూపాయల కాయిన్స్ తీసుకోవటం మానేశారు. దీంతో వారి వద్ద చాలా పెద్ద మొత్తంలో 10 రూపాయల నాణేలు మిగిలి పోయాయి. పిల్లలు కూడా 10 రూపాయల నాణేలు పనికి రానివని అనుకోవటం విన్నాడు.

దీంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకైనా 10 రూపాయల నాణేలతో కారు కొనాలనుకుని నిర్ణయించుకున్నాడు. నెల రోజుల వ్యవధిలో ఆరులక్షల రూపాయలకు సరిపడా 10 రూపాయల నాణేలు సంపాదించాడు. అవి తీసుకుని వెళ్ళినప్పుడు కారు షాపు యజమాని కూడా ఆ నాణేలు తీసుకోటానికి అంగీకరించలేదు. తర్వాత తాను ఎందుకు అలా కొంటున్నాడో వెట్రివేల్ వివరించేసరికి షాపు యజమాని కూడా అంగీకరించాడు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 10 నాణేలు విలువ లేనివి అని చెప్పనప్పుడు బ్యాంకులు ఎందుకు స్వీకరించటం లేదని…. ఫిర్యాదు చేసినా ఎవరూ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని వెట్రివేల్ అన్నాడు. తన బంధువులతో కలిసి 10 రూపాయల నాణేల బస్తాలను షాపులోకి తీసుకు వెళ్లగా అక్కడి సిబ్బంది వాటిని లెక్కించి కారు తాళాలను వెట్రివేల్ కు అందచేశారు.
Also Read : Srinivasa Kalyanam : అమెరికాలో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణాలు
- TamilNadu: నిరూపించడానికే.. రూ.10కాయిన్లతో రూ.6లక్షల కారు కొనుగోలు చేసిన వ్యక్తి
- Cordelia: విశాఖ చేరుకున్న విలాస నౌక ‘కార్డెలియా’.. సకల సౌకర్యాలతో అందుబాటులోకి
- RSS Offices: లక్నోలో ఆర్ఎస్ఎస్ ఆఫీసులు పేల్చేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
- Nagarkurnool : కారు డోర్ లాక్ అవ్వడంతో ఊపిరాడక చిన్నారి మృతి..మూడు రోజులుగా కారులోనే మృతదేహం
- COVID-19: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. తెలంగాణకు కేంద్రం సూచన
1RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
2Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
3Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
4Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
5Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
6Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ
7PM Modi: ఆంధ్రాలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ
8India border: సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చిన మూడేళ్ల పాకిస్థాన్ బాలుడు.. మానవత్వాన్ని చాటుకున్న జవాన్లు..
9KanhaiyaLal: కన్హయ్య హత్య నిందితుడు బీజేపీ కార్యకర్త: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
10Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు