Birthday at Crematorium: స్మశానంలో పుట్టినరోజు వేడులకు చేసుకున్న వ్యక్తి.. బర్త్‌డే కేక్ కటింగ్‌తో పాటు బిర్యాని విందు కూడా అక్కడే
స్మశానంలో దెయ్యాలు, ప్రేతాత్మలు వంటి భయాల నేపథ్యంలో ఆయన ఈ వేడుకలు అక్కడ చేసుకున్నారట. ముంబై సమీపంలోని కల్యాణ్‌కు చెందిన గౌతమ్ మోరె అనే వ్యక్తి అంధాశ్రద్ధ నిర్మూలన్ సమితిలో సభ్యుడు. తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. కాగా, శనివారం మోరె 44వ పుట్టినరోజు. అయితే ఈ పుట్టిన రోజును కూడా సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలనకే ఉపయోగించాలని అనుకున్నారు

man cuts birthday cake at crematorium, hosts biryani party to bust myth
Birthday at Crematorium: మన సమాజంలో మూఢనమ్మకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వాటిని పారదోలేందుకు అనేక మంది హేతువాదులు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. మ్యాజిక్ చేయడం, కనికట్టు ప్రదర్శన గుట్టు విప్పడం, శాస్త్రీయంగా కొన్నింటిని రుజువు చేస్తుండడం వంటివి అనేకం చేస్తుంటారు. అలాగే అర్థ రాత్రుళ్లు స్మశానాలకు వెళ్లి రావడం, గుడుల వద్ద అబూత కల్పలనల గుట్టు విప్పడం లాంటివి కూడా చేస్తుంటారు. ఇందులో భాగంగా ముంబైకి చెందిన ఒక హేతువాది తన పుట్టిన రోజు వేడుకల్ని స్మశానంలో చేసుకున్నారు.
స్మశానంలో దెయ్యాలు, ప్రేతాత్మలు వంటి భయాల నేపథ్యంలో ఆయన ఈ వేడుకలు అక్కడ చేసుకున్నారట. ముంబై సమీపంలోని కల్యాణ్‌కు చెందిన గౌతమ్ మోరె అనే వ్యక్తి అంధాశ్రద్ధ నిర్మూలన్ సమితిలో సభ్యుడు. తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. కాగా, శనివారం మోరె 44వ పుట్టినరోజు. అయితే ఈ పుట్టిన రోజును కూడా సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలనకే ఉపయోగించాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా.. ఈ వేడుకలకు కల్యాణ్‌లోని మోహనె స్మశానంలో ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య స్మశానంలోనే కేక్ కట్ చేశారు. అంతే కాదండోయ్.. కేక్ కట్టింగ్ అనంతరం విందు ఏర్పాటు చేశారు. బిర్యానీ గుమగుమలతో ఏర్పాటు చేసిన ఆ విందు కూడా స్మశానంలోనే జరిగింది. ఈ విషయమై మోరె స్పందిస్తూ ‘‘నా పుట్టినరోజును హోటల్లో చేసుకొమ్మని నా కుటుంబం చెప్పింది. అయితే స్మశానంలో చేసుకుంటే సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని వారిని ఒప్పించి అక్కడే చేసుకున్నాను. ఎందుకంటే స్మశానంలో దెయ్యాలు, తాంత్రికులు ఉంటారని ప్రజలు నమ్ముతారు. ఇలాంటివి కేవలం మూఢనమ్మకాలేనని నిరూపించాలనే స్మశానంలో పుట్టిన రోజు చేసుకున్నాను’’ అని తెలిపారు.